కాలిఫోర్నియా ప్రజలకు వార్నింగ్
అమెరికాను వరదలు ముంచెత్తుతున్నాయి. కాలిఫోర్నియా, లాస్ ఏంజెల్స్ ను వరదలు ముంచెత్తాయి
అమెరికాను వరదలు ముంచెత్తుతున్నాయి. కాలిఫోర్నియా, లాస్ ఏంజెల్స్ ను వరదలు ముంచెత్తాయి. దీంతో అనేక ఇళ్లు వరద నీటిలో మునిగిపోయాయి. భారీ వర్షాల కారణంగా వరదలు కాలిఫోర్నియాను తాకాయి. అనేకచోట్ల ఇళ్లు దెబ్బతిన్నాయి. రహదారులు ఛిద్రమయ్యాయి. మాంటెసిటో నగరంలో పరిస్థితి మరింత దారుణంగా ఉందని అధికారులు చెబుతున్నారు.
సురక్షిత ప్రాంతాలకు...
అదే సమయంలో కాలిఫోర్నియా నుంచి 25 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే బురద ముప్పు పొంచి ఉందని, ప్రజలు కాలిఫోర్నియాను వెంటనే వీడాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మొత్తం 17 ప్రాంతాల్లో భీకర వర్షాలు పడి బీభత్సం సృష్టించాయి. అనేక ప్రాంతాలు నీటిలో చిక్కుకోవడంతో సహాయ బృందాలు రంగంలోకి దిగి చర్యలు చేపట్టాయి. బురద ప్రవాహం పెరగడంతో సహాయక చర్యలకు కూడా ఆటంకం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు.