ఇటలీలో భూకంపం.. తీవ్రత ఎంతంటే?

ఇటలీలో భూకంపం సంభవించింది. ఇటలీలోని కాలబ్రియా ప్రాంతంలో భూమి కంపించింది.;

Update: 2024-08-02 04:24 GMT
earthquake syria, syria
  • whatsapp icon

ఇటలీలో భూకంపం సంభవించింది. ఇటలీలోని కాలబ్రియా ప్రాంతంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.0గా నమోదైందని సంబంధిత అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. భూకంపం సంభవించడంతో ఒక్కసారిగా ప్రజలు భయభ్రాంతులతో బయటకు పరుగులు తీశారు.

భయాందోళనలతో....
భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం మాత్రం జరగలేదని చెబుతున్నారు. ఒక్కసారిగా భూప్రకపంనలు రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇళ్లను వదిలి బయటే గడుపుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Tags:    

Similar News