ఒమిక్రాన్ ఉపరకంపై డబ్ల్యూహెచ్ఓ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆంక్షలు ఎత్తివేయడంపై ?

బీఏ.2 కారణంగా వ్యాధి తీవ్రత పెరుగుతుందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. కానీ.. ఈ రకం వేరియంట్ వేగంగా

Update: 2022-02-02 07:33 GMT

కరోనా నుంచి పుట్టుకొచ్చింది ఒమిక్రాన్. ఆ ఒమిక్రాన్ నుంచి నాలుగు ఉపరకాలు ఉద్భవించాయి. వాటిని వైద్య నిపుణులు బీఏ.1, బీఏ.2, బీఏ.3, బీఏ.4 గా పేర్కొన్నారు. ఈ నాలుగింటిలో ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న ఉపరకం బీఏ.2. సమస్యేంటంటే.. ఆర్టీపీసీఆర్ పరీక్షలకు ఇది దొరకడం లేదు. ఈ ఉపరకంపై డబ్ల్యూహెచ్ఓ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అసలు వేరియంట్ కన్నా.. ఈ కొసరు వేరియంట్ అంత ప్రమాదకరమేమీ కాదని డబ్ల్యూహెచ్ఓ టెక్నికల్ లీడ్ మరియ కెర్ఖోవే తెలిపారు.

బీఏ.2 కారణంగా వ్యాధి తీవ్రత పెరుగుతుందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. కానీ.. ఈ రకం వేరియంట్ వేగంగా విస్తరిస్తున్న కారణంగా.. ప్రజలు జాగ్రత్త ఉండాలని సూచించారు. ప్రస్తుతం బీఏ.2 ఉపరకంతో పాటు.. అసలు వేరియంట్ అయిన ఒమిక్రాన్ కూడా వేగంగా వ్యాప్తి చెందుతోందని తెలిపారు. విస్తరించడంలో వేగంగానే ఉన్న వ్యాధి తీవ్రత మాత్రం.. డెల్టా వేరియంట్ కన్నా తక్కువగా ఉందని మరోసారి స్పష్టం చేశారు కెర్ఖోవే.
ఇదిలా ఉండగా.. కరోనా కేసులు తక్కువగా ఉన్నాయి కదా అని.. చాలా దేశాలు ఆంక్షలు ఎత్తివేయడాన్ని డబ్ల్యూహెచ్ వో చీఫ్ టెడ్రోస్ అధనోం ఘెబ్రియేసస్ తప్పుబట్టారు. వివిధ దేశాల్లో ఒమిక్రాన్ ఇంకా అసలు రూపం చూపలేదని, అది తీవ్ర రూపం దాల్చితే.. తగిన పరిహారం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఒమిక్రాన్ మొదటి స్టేజ్ లోనే ఆంక్షలను ఎత్తివేయడం తొందరపాటు నిర్ణయమేనని టెడ్రోస్ అభిప్రాయపడ్డారు.


Tags:    

Similar News