విషాదం.. మాజీ పోప్ బెనెడిక్ట్ కన్నుమూత

జర్మనీలో జోసెఫ్ రాట్ జింగర్ గా పుట్టిన బెనెడిక్ట్.. 2005లో పోప్ పదవికి ఎంపికయ్యారు. అప్పటికి బెనెడిక్ట్ వయసు..;

Update: 2022-12-31 11:09 GMT
ex pope benedict passed away

ex pope benedict passed away

  • whatsapp icon

ఈ ఏడాది ఆఖరిరోజున ఎలాంటి విషాదాలు లేకుండా ముగిసిపోవాలనుకుంటున్న సమయంలో.. మాజీ పోప్ బెనెడిక్ట్ మరణవార్త అందరినీ కలచివేసింది. వృద్దాప్యంలో వచ్చే పలు అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న ఆయన.. 95 ఏళ్ల వసులో వాటికన్ సిటీలో కన్నుమూశారు. 9 సంవత్సరాల క్రితం ఆయన పోప్ పదవికి రాజీనామా చేశారు. మాజీ పోప్ బెనెడిక్ట్ XVI అనారోగ్య సమస్యలతో.. పదవీవిరమణ పొందిన 10 ఏళ్లకు మరణించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.

జర్మనీలో జోసెఫ్ రాట్ జింగర్ గా పుట్టిన బెనెడిక్ట్.. 2005లో పోప్ పదవికి ఎంపికయ్యారు. అప్పటికి బెనెడిక్ట్ వయసు 78 సంవత్సరాలు. 2013లో ఆయన రాజీనామా అనంతరం.. చివరి వరకూ వాటికన్ లో మేటర్ ఎక్లేసియా కాన్వెంట్ లో గడిపారు. బెనెడిక్ట్ గురించి.. ఆయన వారసుడు, ప్రస్తుతం పోప్ అయిన ఫ్రాన్సిస్ మాట్లాడుతూ.. అనారోగ్య సమస్యలు పెరగడంతో.. ఆయన ఆరోగ్యం మరింత దిగజారిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ ప్రార్థించాలని కోరారు.


Tags:    

Similar News