China : చైనా వణికిపోతుంది... కారణం తెలిస్తే?

చైనా వణికిపోతుంది. టైఫూన్ బెబింకా తుపానుతో విమానసర్వీసులన్నీ రద్దయ్యాయి;

Update: 2024-09-16 05:58 GMT
typhoon, bebinka, flight services, china
  • whatsapp icon

చైనా వణికిపోతుంది. టైఫూన్ బెబింకా తుపాను బలంగా తాకడంతో షాంఘై నగరం చిగురుటాకులా వణికిపోతుంది. విమానసర్వీసులన్నీ రద్దయ్యాయి. గంటలకు 151 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో ప్రజలు భయందోళనలతో పరుగులు తీశారు. గతంలో ఇలాంటి తుపానును ఎన్నడూ చూడలేదని అంటున్నారు.

డెబ్భయి ఏళ్లలో...
దాదాపు డెబ్బయి ఏళ్ల తర్వాత ఇలాంటి తుపానును చూస్తున్నామని మీడియా వార్తలు కూడా వస్తున్నాయి. వందల సంఖ్యలో విమానాలు రద్దు కావడంతో వేల సంఖ్యలో ప్రయాణికులు షాంఘై ఎయిర్‌పోర్టులో పడిగాపులు కాస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఎవరూ సంచరించవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అనేక పర్యాటక ప్రాంతాలను మూసివేశారు. జనజీవితం అస్తవ్యస్తంగా మారింది.


Tags:    

Similar News