Trump: దాడి జరిగిన కొన్ని గంటల్లోనే టీ షర్ట్స్ ను మార్కెట్ లో దింపేశారుగా!!

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం సాయంత్రం

Update: 2024-07-15 06:32 GMT

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం సాయంత్రం పెన్సిల్వేనియాలో ఎన్నికల ర్యాలీ సందర్భంగా హత్యాయత్నం నుంచి తృటిలో తప్పించుకున్నారు. అయితే కొన్ని గంటల్లోనే చైనీస్ రిటైలర్లు ట్రంప్ పై జరిగిన దాడికి సంబంధించిన ఫోటోలతో టీ షర్ట్స్ ను మార్కెట్ లోకి దింపేశారు. ఆన్‌లైన్ లో కూడా ఈ టీ షర్ట్స్ అందుబాటులోకి వచ్చేశాయి. షూటింగ్ జరిగినా భయపడనని ట్రంప్ చెప్పినట్లుగా ఆ టీ షర్ట్స్ మీద ఉంది.

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం, అసోసియేటెడ్ ప్రెస్ ఆదివారం సాయంత్రం 6:31 గంటలకు ట్రంప్ పిడికిలి బిగించిన ఫోటోను ప్రచురించింది. రాత్రి 8:00 గంటలకు US అధ్యక్షుడు జో బైడెన్ స్పందించే సమయానికి.. చైనా తయారీదారులు T- షర్టులను అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. మొదటి బ్యాచ్ రాత్రి 8.40 గంటలకు ప్రసిద్ధ చైనీస్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ టావోబావోలో అమ్మేశారు. ఈ టీ-షర్టులకు భారీ డిమాండ్ వచ్చిందట.. చైనా, US నుండి 2,000 కంటే ఎక్కువ ఆర్డర్‌లు వచ్చాయి.


Tags:    

Similar News