శ్రీలంకలో ఉద్రిక్తత... ప్రధాని ఇంటి వద్ద?

శ్రీలంకలో రోజురోజుకూ పరిస్థితులు దిగజారిపోతున్నాయి. ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రమవడంతో ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు;

Update: 2022-04-08 05:32 GMT
sri lanka, financial crisis, mahendra rajapakse, gotabai rajapakse
  • whatsapp icon

శ్రీలంకలో రోజురోజుకూ పరిస్థితులు దిగజారిపోతున్నాయి. ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రమవడంతో ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. శ్రీలంక ప్రధాని ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేసినా వాటిని తోసుకుని ప్రధాని ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ ను ఉపయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. ప్రస్తుతం మూడంచెలలో ఒక అంచె దాటుకుని ఆందోళనకారులు లోపలికి చొరబడ్డారు.

రాజీనామా చేయాలని....
ప్రధాని మహేంద్ర రాజపక్సే, ఆయన సోదరుడు అధ్యక్షుడు గొటబయే రాజపక్సేలు ఈ పరిస్థితికి కారణమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తమ పదవులకు రాజీనామాలు చేసి దిగిపోవాలని ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. రాజీనామా చేసేంత వరకూ ఇక్కడి నుంచి కదిలేది లేదని ప్రజలు ప్రధాని నివాసం ముందే బైఠాయించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీలంకలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది.


Tags:    

Similar News