Thomas Matthew Crooks: ఎవరీ థామస్ మాథ్యూ క్రూక్స్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై దాడి పక్కా ప్లాన్ తో
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై దాడి పక్కా ప్లాన్ తో, ముందస్తు ఏర్పాట్లతోనే జరిగింది. పెన్సిల్వేనియాలోని బట్లర్ లో ట్రంప్ సభాస్థలికి దగ్గర్లోని ఓ ఇంటిపై షూటర్ ముందే ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంటిపైకి ఎక్కేందుకు షూటర్ ఓ నిచ్చెన అమర్చుకున్నాడని, ట్రంప్ రాకకు చాలా ముందుగానే పైకి చేరుకుని ఓపిగ్గా వెయిట్ చేశాడని వివరించారు. సభాస్థలి బాగా కనిపించేలా చూసుకుని పొజిషన్ తీసుకున్నట్లు తెలిపారు.
ట్రంప్ పై కాల్పులు జరిపిన యువకుడి పేరు థామస్ మాథ్యూ క్రూక్. వయసు 20 ఏళ్లు. స్థానిక వ్యక్తి. ఈ కాల్పుల ఘటనను పోలీసులు హత్యాయత్నంగానే దర్యాఫ్తు చేపట్టినట్లు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారికంగా ప్రకటించింది. డొనాల్డ్ ట్రంప్ పెన్సిల్వేనియా ర్యాలీ కాల్పుల్లో భద్రతా బలగాల కాల్పుల్లో హతమైన నిందితుడిని 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్‌గా గుర్తించినట్లు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారిక ప్రకటనలో తెలిపింది.ట్రంప్ పై కాల్పులకు దుండగుడు ఏఆర్- 15 గన్ ని ఉపయోగించాడని పోలీసులు గుర్తించారు. ఈ సెమీ ఆటోమేటిక్ రైఫిల్‌తో 182 మీటర్ల దూరం నుంచి కాల్చినట్లు భద్రతా దళాలు నిర్ధారించాయి. సభావేదికకు ఎదురుగా ఉన్న బిల్డింగ్ పైనుంచి మొత్తం ఆరు రౌండ్లు కాల్చాడని, అందులో ఒక బుల్లెట్ ట్రంప్ చెవిని తాకింది.
డొనాల్డ్ ట్రంప్ హత్యాయత్నంలో 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ ప్రమేయం ఉన్నట్లు FBI గుర్తించింది. షూటర్ రిజిస్టర్డ్ రిపబ్లికన్ అని రాష్ట్ర ఓటరు రికార్డులలో తేలింది. పెన్సిల్వేనియాలోని బెతెల్ పార్క్‌కు చెందిన 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ డొనాల్డ్ ట్రంప్ హత్యాయత్నానికి పాల్పడినట్లు FBI గుర్తించింది. అయితే దర్యాప్తులో సహాయపడే సమాచారం ఉన్న ఎవరైనా FBI.gov/butlerలో ఆన్‌లైన్‌లో ఫోటోలు లేదా వీడియోలను సమర్పించమని లేదా 1-800-CALL-FBIకి కాల్ చేయాలని ఏజెన్సీ అధికారిక ప్రకటనలో తెలిపింది.