Donald Trump: డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం

అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై;

Update: 2024-07-14 02:24 GMT
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం
  • whatsapp icon

అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా బుల్లెట్ ట్రంప్‌ చెవికి దూసుకుపోయింది. బుల్లెట్ తగిలిన వెంటనే ట్రంప్ తాను ఉన్న ప్రదేశంలో కిందకు వంగారు. తక్షణమే అప్రతమత్తమైన భద్రతా సిబ్బంది రక్షణగా నిలిచింది. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ తక్షణమే ఆయనను హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. చనిపోయినవారిలో నిందితుడు కూడా ఉండి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. బుల్లెట్ గాయాల పాలైన ట్రంప్‌ చెవి, ముఖంపై రక్తం ఉంది. ట్రంప్‌ను హాస్పిటల్‌కు తరలిస్తున్న సమయంలో ఆయన పిడికిలి బిగించి ఎన్నికల ర్యాలీలోని ప్రజలకు చూపించారు.


Tags:    

Similar News