బంగారు గనిలో భారీ పేలుడు : 59 మంది మృతి, మరో 100 మందికి గాయాలు

బంగారాన్ని శుద్ధిచేసేందుకు ఉపయోగించే రసాయన పదార్థాల వల్లే పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. తొలుత రాత్రి 2 గంటల సమయంలో ..

Update: 2022-02-22 06:24 GMT

బంగారు గనిలో భారీ పేలుడు సంభవించి 59 మంది మృతి చెందగా.. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘోర ప్రమాదం పశ్చిమ ఆఫ్రికా దేశంలోని బుర్కినా ఫాసోలో చోటుచేసుకుంది. బామ్ బ్లోరా గ్రామంలోని బంగారు గ‌నిలో భారీ పేలుడు సంభవించడంతో.. 59 మంది స్పాట్ లోనే చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో మరో 100 మందికి పైగా గాయపడినట్లు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

కాగా.. బంగారాన్ని శుద్ధిచేసేందుకు ఉపయోగించే రసాయన పదార్థాల వల్లే పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. తొలుత రాత్రి 2 గంటల సమయంలో పేలుడు సంభవించిందని అక్కడి అధికారి ఒకరు తెలిపారు. ఘటనా ప్రాంతంలో దృశ్యాలు భీతావహంగా ఉన్నాయని, పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయని తెలిపారు. ఆఫ్రికాలో బంగారాన్ని అత్యధికంగా ఉత్పత్తి దేశాల్లో బుర్కినా ఫాసో ఒకటి. అక్కడి బంగారు గనుల్లో సుమారు పదిన్నర లక్షల మంది పనిచేస్తున్నారు. గామ్ బ్లోరాలో సుమారు 800 ఎకరాల్లో చిన్న చిన్న బంగారు గనులున్నాయి. అక్కడి నుంచి టోగో, బెనైన్‌, నైగర్‌, ఘనా దేశాలకు బంగారాన్ని అక్రమంగా తరలిస్తుంటారు.



Tags:    

Similar News