తైవాన్‌లో భారీ భూకంపం

తైవాన్ రాజధాని తైపీలో ఈరోజు తెల్లవారుజామున భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.9 గా నమోదయింది

Update: 2023-10-24 02:40 GMT

తైవాన్ రాజధాని తైపీలో ఈరోజు తెల్లవారుజామున భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.9 గా నమోదయిందని అధికారులు వెల్లడించారు. భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. అనేక భవనాలు కంపించడంతో జనం భయపడి పోయారు. తీవ్రత ఎక్కువగా ఉండటంతో కొన్ని భవనాలకు పగుళ్లు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

నేపాల్‌లో మరోసారి...
ద్వీపం తూర్పు తీరానికి సమీపంలో ఉన్న సముద్రంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తైవాన్ సెంట్రల్ వెదర్ బ్యూరో ప్రకటించింది. ఇదిలా ఉండగా నేపాల్ లోనూ భూకంపం సంభవించింది. ఈరోజు ఉదయం మరోసారి భూకంపం రావడంతో ప్రజలు భయకంపితులయ్యారు. ఖాట్మండులో సంభవించిన భూకంప తీవ్రత 4.1గా రిక్టర్ స్కేల్ పై నమోదయిందని అధికారులు వెల్లడించారు. అయితే రెండు చోట్ల ఎంత ఆస్తి, ప్రాణ నష్టం సంభవించిందీ ఇంకా తెలియ రాలేదు.


Tags:    

Similar News