మలేషియాలో వలస కార్మికులకు అన్నదానం

జగిత్యాల రూరల్ మండలం కల్లెడకు చెందిన ఎన్నారై గాజెంగి రంజిత్ 40 మంది పేదలకు అన్నదానం చేశారు.;

Update: 2023-07-26 08:16 GMT
మలేషియాలో వలస కార్మికులకు అన్నదానం
  • whatsapp icon

జగిత్యాల జిల్లా వాసి ఔదార్యం

మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో పెటాలింగ్ స్ట్రీట్ లో బుధవారం (26.07.2023) జగిత్యాల రూరల్ మండలం కల్లెడకు చెందిన ఎన్నారై గాజెంగి రంజిత్ 40 మంది పేదలకు అన్నదానం చేశారు. మలేషియా పర్యటనలో ఉన్న వలస కార్మిక నాయకుడు మంద భీంరెడ్డి గౌరవార్థం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మహబూబ్ నగర్ కు చెందిన యువ నాయకుడు పూసులూరి కాంతికిరణ్ భార్గవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మంద భీంరెడ్డి మాట్లాడుతూ.. సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న గాజెంగి రంజిత్ మలేషియాలో వలస కార్మికులకు, పేదలకు అవసరమైన సహాయం అందించడం, సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనడం అభినందనీయమని అన్నారు. కార్మికులకు ఉపయోగపడే వలస కార్మిక నిబంధనల పుస్తకాలను, ప్రచార సామగ్రిని రంజిత్ కు బహుకరించారు.


 


Tags:    

Similar News