26 సంవత్సరాలకే కన్నుమూసిన షెరికా

మాజీ మిస్ వరల్డ్ కంటెస్టెంట్, అడ్వర్టైజింగ్ మోడల్ షెరికా డి అర్మాస్

Update: 2023-10-16 10:14 GMT

మాజీ మిస్ వరల్డ్ కంటెస్టెంట్, అడ్వర్టైజింగ్ మోడల్ షెరికా డి అర్మాస్ కన్నుమూశారు. ఆమె వయసు 26 సంవత్సరాలు. గత కొంతకాలంగా గర్భాశయ కేన్సర్‌తో బాధపడుతున్న ఆమె చనిపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. షెరికా సొంత దేశం ఉరుగ్వే. కీమోథెరపీ, రేడియోథెరపీ చికిత్సలతో దాదాపు రెండేళ్లపాటు పోరాడింది షెరికా. అర్మాస్ మరణంపై స్నేహితులు, సన్నిహితులు తీవ్ర సంతాపం వెలిబుచ్చారు.

2015లో జరిగిన మిస్ వరల్డ్ పోటీలో ఉరుగ్వేకు ప్రాతినిధ్యం వహించారు షెరికా. 2015 చైనాలో జరిగిన మిస్ వరల్డ్ పోటీలో షెరికా డి అర్మాస్ కు అదృష్టం వరించలేదు. మోడల్‌గా సుదీర్ఘమైన కెరీర్ ను కొనసాగించాలని అర్మాస్‌ గతంలో తెలిపారు. ఫ్యాషన్‌కి సంబంధించిన ప్రతిదీ ఇష్టపడుతూ వచ్చారు. కానీ ఆమెను గర్భాశయ కేన్సర్ కబళించి వేసింది. షే డి అర్మాస్ స్టూడియో పేరుతో హెయిర్‌, వ్యక్తిగత సంరక్షణకు సంబంధించిన ఉత్పత్తుల వ్యాపారాన్ని కూడా మొదలు పెట్టారు. అంతేకాదు కేన్సర్‌తో బాధ పడుతున్న పిల్లల చికిత్స చేసే పెరెజ్ స్క్రీమినీ ఫౌండేషన్‌కోసం కొంత సమయాన్ని వెచ్చించారు.


Tags:    

Similar News