శ్రీలంకకు చేరుకున్న రాజపక్సే

శ్రీలంకను విడిచి వెళ్లిపోయిన ఆ దేశ మాజీ అధ్యక్షుడు గొటబాయి రాజపక్స తిరిగి దేశానికి చేరుకున్నారు

Update: 2022-09-03 04:27 GMT

శ్రీలంకను విడిచి వెళ్లిపోయిన ఆ దేశ మాజీ అధ్యక్షుడు గొటబాయి రాజపక్స తిరిగి దేశానికి చేరుకున్నారు. దాదాపు యాభై రోజుల తర్వాత ఆయన శ్రీలంక చేరుకున్నారు. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ముదరడంతో లంకవాసులు తిరగబడ్డారు. పెద్దయెత్తున ఆందోళనకు దిగారు. దీంతో ఆయన తొలుత మాల్దీవులకు పరారయ్యారు. అక్కడ కూడా ఆందోళనలు తలెత్తడంతో సింగపూర్ కు వెళ్లిపోయారు. సింగపూర్ నుంచి చివరిగా థాయ్‌లాండ్ కు చేరుకున్నారు.

మూడు చోట్ల తిరిగి....
అయితే థాయ్‌లాండ్ ప్రభుత్వం అక్కడ నివసించేందుకు కేవలం మూడు నెలలు మాత్రమే సమయం ఇచ్చింది. అయితే శ్రీలంకలో కొద్దిగా పరిస్థితులు చక్క బడటం, కొత్త అధ్యక్షుడు ఎన్నిక కావడంతో ఆయన తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. ఆయన కు శ్రీలంకలో భద్రత కల్పించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఆయన ఇంటిపై దాడులు నిర్వహించకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.


Tags:    

Similar News