గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కు జాక్ పాట్

సీఈఓగా సుందర్ పిచాయ్ అద్భుతమైన పనితీరును కనబరుస్తున్నారని పేర్కొన్న గూగుల్.. అందుకు ఆయనకు ఈక్విటీ రివార్డును..;

Update: 2023-01-31 05:05 GMT
google layoff, alphabet inc, google ceo sundar pichai

google ceo sundar pichai

  • whatsapp icon

ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ 12 వేలమంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్టు రెండ్రోజుల క్రితమే ప్రకటించి అందరికీ షాకిచ్చింది. అనంతరం ఉద్యోగుల తొలగింపునకు పూర్తి బాధ్యత తనదేనని ప్రకటించారు సీఈఓ సుందయ్ పిచాయ్. ఉద్యోగం కోల్పోయిన వారికి కంపెనీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాగా.. తాజాగా సుందర్ పిచాయ్ గురించి సరికొత్త విషయం వెలుగులోకొచ్చింది. ఆయన జాక్ పాట్ కొట్టారు. ఉద్యోగుల తొలగింపు నిర్ణయానికి కొన్నివారాల ముందే సుందర్ పిచాయ్ భారీ వేతన పెంపును అందుకున్నారట.

సీఈఓగా సుందర్ పిచాయ్ అద్భుతమైన పనితీరును కనబరుస్తున్నారని పేర్కొన్న గూగుల్.. అందుకు ఆయనకు ఈక్విటీ రివార్డును ఇవ్వనున్నట్టు తెలిపింది. అందులో భాగంగా 2019లో 43 శాతంగా ఉన్న పెర్మార్మెన్స్ స్టాక్ట్ యూనిట్స్ (పీఎస్‌యూలు)ను 60 శాతానికి సవరిస్తున్నట్టు పేర్కొంది. ఫలితంగా పిచాయ్ వేతనం భారీగా పెరిగింది. ప్రతి మూడేళ్లకు ఒకసారి గూగుల్ సీఈవోకు ఈక్విటీ కాంపెన్సేషన్ లభిస్తుంది. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ తాజా ప్రకటన నేపథ్యంలో పిచాయ్.. 63 మిలియన్ డాలర్ల విలువైన రెండు పీఎస్‌యూ ట్రాంచ్‌లను, 84 మిలియన్ డాలర్ల విలువైన ఆల్ఫాబెట్ రిస్ట్రిక్టిడ్ స్టాక్ యూనిట్లను అందుకున్నారు.






Tags:    

Similar News