తలపై క్రిస్మస్ ట్రీ హెయిర్ స్టైల్.. గిన్నిస్ రికార్డు సాధించిన హెయిర్ స్టైలిస్ట్(వీడియో)

డానీ హిస్వానీ అనే అతను.. ఇప్పటికే అనేక సార్లు అనేక రకాల హెయిర్ స్టైల్స్ ను రూపొందించి పలు రికార్డులను సాధించాడు. అంతేనా.;

Update: 2022-12-21 06:13 GMT
christmas tree with hair, syrian hair stylist record, guinness world records

christmas tree with hair

  • whatsapp icon

క్రిస్మస్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది.. క్రిస్మస్ స్టార్, క్రిస్మస్ ట్రీ, శాంటా. ఈ పండుగ శోభ క్రిస్మస్ స్టార్ లైట్స్, క్రిస్మస్ ట్రీ లను అలంకరించడంలోనే దాగుంది. అలా ఓ హెయిర్ స్టైలిస్ట్.. జుట్టుతో క్రిస్మస్ ట్రీని తయారు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించాడు. మగువలకు రకరకాలుగా హెయిర్ ను స్టైల్ చేయడం హెయిర్ స్టైలిస్ట్ ల ప్రత్యేకత. పార్టీలు, శుభకార్యాలు, ఈవెంట్లు ఇలా.. ఒక్కోసారి ఒక్కోరకమైన హెయిర్ స్టైల్ లను సెట్ చేస్తుంటారు. తాజాగా ఓ ప్రఖ్యాత సిరియన్ హెయిర్ స్టైలిస్ట్ డానీ హిస్వానీ తన ప్రతిభతో ఓ మహిళ తలపై ఏకంగా క్రిస్మస్ ట్రీనే రూపొందించాడు.

డానీ హిస్వానీ అనే అతను.. ఇప్పటికే అనేక సార్లు అనేక రకాల హెయిర్ స్టైల్స్ ను రూపొందించి పలు రికార్డులను సాధించాడు. అంతేనా.. పలు ప్రపంచ మ్యాగ్జైన్లలోనూ అతని గురించి ఆర్టికల్స్ వచ్చాయి. బాలీవుడ్, హాలీవుడ్ హీరోయిన్స్ దీపిక పదుకొనే, ప్యారిస్ హిల్టన్ వంటి గొప్పగొప్ప సెలబ్రిటీలకు హెయిర్ స్టైలిస్ట్ గా పనిచేసిన అనుభవం ఉంది. అతని అనుభవాన్నంతా.. జుట్టుతో క్రిస్మస్ ట్రీ తయారు చేసేందుకు ఉపయోగించాడు. బుర్రకు పదునుపెట్టి..ఓ మోడల్ తలపై 2.90 మీటర్ల ( 9 అడుగుల 6.5 అంగుళాలు) ఎత్తులో క్రిస్మస్ ట్రీ ఆకారంలో జట్టును అలంకరించాడు.
మోడల్ తలపై క్రిస్మస్ ట్రీని తయారు చేసేందుకు.. ఆమె తలపై సపోర్ట్ గా ఓ హెల్మెట్ ను పెట్టాడు. దానిపై మూడు మెటల్ రాడ్లు అమర్చి జుట్టును క్రిస్మస్ ట్రీ ఆకారంలో వచ్చేందుకు విగ్ లు, హెయిర్ ఎక్స్టన్షన్ను ఉపయోగించాడు. దీంతో 2.90 మీటర్ల ఎత్తైన కేశాలంకరణతో గిన్సీ స్ వరల్డ్ రికార్డ్ సాధించాడు. ఈ ఏడాది సెప్టెంబర్ 16న దుబాయ్ లో జరిగిన ఓ ఈవెంట్ లో ఈ క్రిస్మస్ ట్రీ ని తయారు చేసి రికార్డు సృష్టించాడు. దీనిని గుర్తించిన గిన్నీస్ సంస్థవాళ్లు.. అతని పేరును గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పెట్టారు. తాజాగా రికార్డు పొందిన వీడియోను గిన్సీస్ బుక్ ఆప్ వరల్డ్ అధికారిక ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో వీడియోను పోస్టు చేశారు. ఈ వీడియో వైరల్ గా మారింది.




Tags:    

Similar News