ఇకపై సహజీవనం చట్టరీత్యా నేరం.. ఉల్లంఘిస్తే ఆరునెలలు జైలు శిక్ష

ఈ కొత్త చట్టం ప్రకారం.. వివాహేతర సంబంధాలు ఇకపై నేరంగా పరిగణిస్తారు. ఎవరైనా పెళ్లి చేసుకోకుండా.. అంటే సహజీవనం చేస్తే ఆరు..;

Update: 2022-12-07 05:07 GMT
indonesia new law, indonesia bans live in and extra marital affairs

indonesia new law

  • whatsapp icon

పెళ్లికి ముందే సహజీవనం పేరుతో యువతీ, యువకులు కలిసి ఉండటం షరా మామూలు అయిపోయింది. అందులో తప్పేముంది.. అలా ఉండటం బాగుంటే పెళ్లి, లేదంటే విడిపోతాం అంటూ కొత్తకొత్త పోకడలకు పోతున్న యువతకు ఓ దేశం షాకిచ్చింది. ఇకపై వివాహేతర సంబంధాలు, సహజీవనం చట్టరీత్యా నేరాలుగా పరిగణించబడుతాయని పేర్కొంటూ ఇండోనేషియా ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రవేశ పెట్టిన బిల్లుకు నిన్న పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఇక్కడ స్వలింగ సంపర్కంపై నిషేధం ఉంది.

ఈ కొత్త చట్టం ప్రకారం.. వివాహేతర సంబంధాలు ఇకపై నేరంగా పరిగణిస్తారు. ఎవరైనా పెళ్లి చేసుకోకుండా.. అంటే సహజీవనం చేస్తే ఆరు నెలల జైలు శిక్ష తప్పదు. బిల్లు ఆమోదం పొందిన అనంతరం న్యాయ, మానవహక్కుల మంత్రి యసొన్నా లాలోరి మాట్లాడుతూ.. అనేకమంది అభిప్రాయాలు, కీలకమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించామని, అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. కానీ.. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై దేశంలోని యువత నుండి తీవ్రవ్యతిరేకత వ్యక్తమవుతోంది.
అలాగే.. ఈ చట్టం పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వ్యాపారులు సైతం మండిపడుతున్నారు. అయితే.. అక్కడికి విచ్చేసే విదేశీయులకు ఈ కొత్తచట్టం వర్తించదని అధికారులు చెబుతున్నారు. ఇది పౌర హక్కుల అణచివేత తప్ప మరొకటి కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాగా, ఈ చట్టానికి ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో ఆమోదం తెలపాల్సి ఉంది. ఆయన ఆమోదం తెలిపిన మూడేళ్లకు ఈ చట్టం అమల్లోకి వస్తుంది.



Tags:    

Similar News