భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
ఈ క్రమంలో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అలస్కా సమీపంలో 9.3 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని
అమెరికాలోని అలస్కా సమీపంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దానితీవ్రత 7.4గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ క్రమంలో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అలస్కా సమీపంలో 9.3 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అలస్కా ద్వీపకల్పం, అలూటియన్ దీవులు, కుక్ ఇన్ లెట్ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించినట్లు అలస్కా భూ కంప కేంద్రం వెల్లడించింది. ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన సమాచారం పై ఇంకా స్పష్టత లేదు.
కాగా.. 1964 మార్చిలో అలస్కాలో 9.2 తీవ్రతతో భూకంపం రాగా.. ఇప్పటి వరకూ ఉత్తర అమెరికాలో ఆ స్థాయిలో భూకంపాలు సంభవించలేదు. చరిత్రలో అదే అత్యంత తీవ్రమైన భూకంపంగా చెబుతుంటారు. అప్పుడు సునామీ రాగా..ఆ ప్రకృతి విలయంలో 250 మంది ప్రాణాలు కోల్పోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మళ్లీ ఇప్పుడు సునామీ హెచ్చరికలు జారీ కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.