భూమిని ఢీకొట్టనున్న భారీ గ్రహశకలం.. ఎప్పుడంటే..
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కీలక సమాచారం ఇచ్చింది. ఒక భారీ గ్రహశకలం భూమిని ఢీకొనే అవకాశం ఉందని పేర్కొంది..
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కీలక సమాచారం ఇచ్చింది. మరో 159 ఏళ్లలో ఒక భారీ గ్రహశకలం భూమిని ఢీకొనే అవకాశం ఉందని పేర్కొంది. ప్రభావం 22 అణు బాంబులంతటి శక్తివంతమైందని కూడా శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. అయితే శాస్త్రవేత్తల అంచనాను బట్టి 2182 నాటికి బెన్నూ గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశం స్వల్పంగా ఉంది. ఒకవేళ బెన్నూ ఆస్టరాయిడ్ ఢీకొంటే.. 22 అణు బాంబుల శక్తితో భూమిపై ప్రభావం చూపుతుందని పలు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అయితే రానున్న కాలంలో అంతరిక్షం నుంచి భూమికి పెను సంక్షోభం రాబోతోంది. దీనిపై నాసా కన్ను వేసింది. దీనిపే ఆస్టరాయిడ్ బెన్నూ. దీని కారణంగా భవిష్యత్తులో ఈ భారీ గ్రహశకలం భూమిని ఢీకొనే ప్రమాదం ఉందని అమెరికన్ స్పేస్ ఏజెన్సీ ఇప్పటికే స్పష్టం చేసింది. బెన్నూ గ్రహశకలాన్ని 1999లో మొదటిసారిగా నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు.