ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ యొక్క మాతృ సంస్థ అయిన మెటాపై రష్యా సంచలన నిర్ణయం తీసుకుంది. ఫెడరల్ సర్వీస్ ఫర్ ఫైనాన్షియల్ మానిటరింగ్ (రోస్ఫిన్‌మోనిటరింగ్) యొక్క డేటాబేస్ ప్రకారం "ఉగ్రవాద మరియు తీవ్రవాద" సంస్థల జాబితాలో రష్యా 'మెటా'ను చేర్చింది. ఈ ఏడాది ప్రారంభంలో రష్యా కోర్టు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ను దేశంలో నిషేధించింది. దాని మాతృ సంస్థ మెటాను ఉగ్రవాదిగా పేర్కొంది. ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించిన నేపథ్యంలో సోషల్ మీడియా దిగ్గజాలను రష్యా అణిచివేయడం మొదలుపెట్టింది. ఏప్రిల్‌లో, మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌ను రష్యా విదేశాంగ శాఖ దేశంలోకి ప్రవేశించకుండా నిషేధించింది. జుకర్‌బర్గ్, పలువురు ఉన్నత స్థాయి వ్యక్తులతో పాటు రష్యాఫోబిక్ ఎజెండాను ప్రచారం చేశారని ఆరోపించారు. ఇప్పుడు రష్యా తన ఉగ్రవాద సంస్థ జాబితాలో మెటాను చేర్చింది. ఉక్రెయిన్‌పై రష్యా తన సైనిక దాడులను తీవ్రతరం చేసిన తర్వాత ఈ చర్యలను తీసుకుంది.