శ్రీలంకకు కొత్త అధ్యక్షుడు..ఈయన వల్ల అవుతుందా?
శ్రీలంకలో కొత్త అధ్యక్షుడి ఎంపిక జరగనుంది. ఈ నెల 20న అధ్యక్షుడిని ఎన్నుకోనున్నట్లు స్పీకర్ మహీంద యాపా అబేవర్ధన తెలిపారు
శ్రీలంకలో కొత్త అధ్యక్షుడి ఎంపిక జరగనుంది. ఈ నెల 20వ తేదీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్నట్లు స్పీకర్ మహీంద యాపా అబేవర్ధన ప్రకటించారు. అన్ని పార్టీలూ కలసి తీసుకున్న నిర్ణయం మేరకు కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది శ్రీలంక అధ్యక్షుడు గొటబాయి రాజపక్స, ప్రధాని రణిల్ విక్రమ్ సింఘే లు రాజీనామా చేయడంతో శ్రీలకం పాలనలో అనిశ్చితి నెలకొంది. కొత్త అధ్యక్షుడి ఎంపిక అవసరమన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది.
ఆర్థిక సంక్షోభం నుంచి...
శ్రీలంకలో గత కొద్దిరోజులుగా ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్థంగా మారింది. దీంతో ప్రజలు ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు. శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని గట్టెక్కించేవారి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. అయితే తాను అధ్యక్ష బాధ్యతలను చేపడతానని సజిత్ ప్రేమదాస చెబుతున్నారు. అన్ని పార్టీల అంగీకారంతోనే తాను అధ్యక్ష బాధ్యతలను స్వీకరిస్తానని, శ్రీలంకను ఈ సంక్షోభం నుంచి బయటపడేసేందుకు తమ వద్ద ప్రణాళిక ఉందని ఆయన పేర్కొన్నారు.
గత ఎన్నికలలో...
ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అధ్యక్ష బాధ్యతలను చేపట్టేందుకు ఎవరూ ముందుకు రాకపోవచ్చు. వచ్చిన విక్రమ్ సింఘే కూడా పరిస్థితిని చక్కదిద్దలేక చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సజిత్ ప్రేమదాసకు ఎవరూ పోటీ రారని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఆయన ఓటమి పాలయ్యారు.