ఎయిర్ షోలో ఊహించని అపశృతి

Update: 2022-11-13 03:53 GMT

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో జరిగిన ఎయిర్ షోలో విషాదం చోటు చేసుకుంది. డల్లాస్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్‌పోర్ట్‌లో శనివారం జరిగిన ఎయిర్‌షోలో చారిత్రాత్మక యుద్ద విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. టెక్సాస్‌లోని డల్లాస్ నగరంలో జరిగిన ఎయిర్ షోలో ఈ సంఘటన జరిగింది. ఈ ఎయిర్ షోలో రెండు ప్రపంచ యుద్ధ కాలంలో ఉపయోగించిన బోయింగ్ B-17 ఫ్లయింగ్ ఫోర్ట్రెస్, బెల్ P-63 కింగ్‌కోబ్రా విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రమాద సమయంలో ఆరుగురు వ్యక్తులు విమానంలో ఉన్నారనీ, వారందరూ చనిపోయి ఉండవచ్చని మీడియా కథనాలు తెలిపాయి. సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటన ప్రకారం బోయింగ్ B-17 ఫ్లయింగ్ ఫోర్ట్రెస్, బెల్ P-63 కింగ్‌కోబ్రా విమానాలు మధ్యాహ్నం 1:20 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ఢీకొని కూలిపోయాయి.



Tags:    

Similar News