కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి
మినాస్ గెరైస్ స్టేట్ లో ఉన్న పాపులర్ డిస్టినేషన్ క్యాపిటోలియో కానియోన్స్ లో జరిగిందీ ఘటన. మోటార్ బోట్ల సహాయంతో
వాటర్ ఫాల్స్ లో ఎంజాయ్ చేస్తున్న వారిపై కొండచరియలు విరిగిపడటంతో.. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బ్రెజిల్ లోని మినాస్ గెరైస్ స్టేట్ లో ఉన్న పాపులర్ డిస్టినేషన్ క్యాపిటోలియో కానియోన్స్ లో జరిగిందీ ఘటన. మోటార్ బోట్ల సహాయంతో వాటర్ ఫాల్ దగ్గరకు వెళ్లి వస్తుండగా.. ఒక్కసారిగా పర్వతంలోని కొంతభాగం నిలువుగా విరిగిపడింది. ఆ సమయంలో అక్కడ 16 మంది ఉండగా.. ఏడుగురు మృతి చెందారని, మరో తొమ్మిదిమంది గాయపడ్డారని తెలుస్తోంది. మరో ముగ్గురి ఆచూకీ తెలియాల్సి ఉంది.
Also Read : కోవిడ్ తో కల్లోలం... రోజుకు నలభై వేల కేసులు
కొండచరియలు విరిగి పడిన ఘటనలో.. గాయపడిన క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో చాలా మందికి ఎముకలు విరిగి ఆస్పత్రిలో సీరియస్ కండిషన్లో ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు. మరో 23 మంది తేలికపాటి గాయాలతో బయటపడ్డారు. కాగా.. ఈ ఆకస్మిక ప్రమాదంపై బ్రెజిలియన్ నేవీ ఎంక్వైరీ చేపట్టనుంది.