స్వీడన్, ఫిన్లాండ్ లకు రష్యా సీరియస్ వార్నింగ్..!

తాజాగా రష్యా మరో రెండు దేశాలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. స్వీడన్, ఫిన్లాండ్ దేశాలు కూడా నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్..

Update: 2022-02-26 08:00 GMT

రష్యా : ఉక్రెయిన్ పై రష్యా వరుసగా మూడో రోజు దాడులు చేస్తోంది. కీవ్ నగరాన్ని ఆక్రమించుకునేందుకు రష్యా సైన్యం ప్రయత్నిస్తోంది. ఓ వైపు గడ్డకట్టే చలి.. మరో వైపు దద్దరిల్లే బాంబుల మోతతో ఉక్రెయిన్ చిగురుటాకులా వణికిపోతోంది. కాగా.. తాజాగా రష్యా మరో రెండు దేశాలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. స్వీడన్, ఫిన్లాండ్ దేశాలు కూడా నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) కూటమిలో చేరితే.. మీకూ ఉక్రెయిన్ కు పట్టిన గతే పడుతుందని రష్యా హెచ్చరికలు జారీ చేసింది.

రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ ఈ మేరకు హెచ్చరించారు. ఉక్రెయిన్ పై దాడికి దిగాలని పుతిన్ ఆదేశించిన తర్వాత పెస్కోవ్ నుంచి ఈ హెచ్చరిక జారీ అయింది. కాగా.. రష్యా అధికారిక మీడియా సంస్థ స్పుత్నిక్ కథనం ప్రకారం, ఉక్రెయిన్ తో చర్చల కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక బృందాన్ని కీవ్ కు పంపుతున్నట్లు తెలుస్తోంది. ఈ బృందంలో రక్షణశాఖ, విదేశాంగశాఖ, పాలనాశాఖలకు చెందిన అధికారులు ఉంటారు. మరోవైపు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ మీడియాతో మాట్లాడుతూ, ఉక్రెయిన్ సైన్యం ఆయుధాలను వదిలేస్తే ఆ దేశంతో చర్చలు జరుపుతామని అన్నారు.




Tags:    

Similar News