టైటానిక్ వద్దకు 33 సార్లు వెళ్లిన కామెరూన్.. ఆ ప్రాంతంపై ఏమన్నారంటే..

తాజాగా మునిగిపోయిన టైటానిక్ శకలాలను చూసేందుకు టైటాన్ జలాంతర్గామిలో ఐదుగురు బిలీనియర్లు జూన్ 18న..

Update: 2023-06-23 03:35 GMT

జేమ్స్ కామెరూన్.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. టైటానిక్ ను డాక్యుమెంటరీగా తీసి.. ఆ షిప్ సముద్రగర్భంలో ఎలా మునిగిపోయిందో చూపించిన వ్యక్తి. ఆ తర్వాత అవతార్, అవతార్ 2 లతో పాటు ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలు తీశారు. టైటానిక్ ఎవర్ గ్రీన్ సినిమాను తీసేందుకు.. జేమ్స్ కామోరూన్ స్వయంగా ఆ షిప్ మునిగిపోయిన ప్రాంతానికి వెళ్లారు. సముద్రగర్భంలో 13 వేల అడుగుల లోతున ఉండిపోయిన చరిత్ర మిగిల్చిన సజీవ సాక్ష్యాన్ని చూసేందుకు 33 సార్లు వెళ్లారాయన.

తాజాగా మునిగిపోయిన టైటానిక్ శకలాలను చూసేందుకు టైటాన్ జలాంతర్గామిలో ఐదుగురు బిలీనియర్లు జూన్ 18న సముద్రగర్భంలోకి వెళ్లారు. రెండు రోజులకు దాని ఆచూకీ గల్లంతవ్వడంతో.. కోస్ట్ గార్డులు ఆచూకీ కోసం తీవ్రంగా వెతికారు. మిస్సైన జలాంతర్గామి కథ విషాదాంతమైంది. తీవ్రమైన పీడనం పెరగడంతో ఆ సబ్ మెరైన్ పేలిపోయిందని, అందులో వెళ్లిన ఐదుగురూ మరణించారని అమెరికా కోస్ట్ గార్డ్ ప్రకటించింది. ఈ క్రమంలో టైటానిక్ మునిగిపోయిన ప్రదేశంపై జేమ్స్ కామెరూన్ గతంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అనేకసార్లు ఆ ప్రాంతాన్ని సందర్శించిన వ్యక్తిగా.. తన అనుభవాన్ని తెలిపారు. ఈ భూమ్మీద అత్యంత క్రూరమైన ప్రదేశాల్లో అదీ ఒకటని చెప్పారు.
మనుషులు ఎప్పుడూ చూడని ప్రదేశాలను చూడటమంటే తనకెంతో ఆసక్తి అని, అందుకే టైటానిక్ శకలాలను చూసేందుకు వెళ్లినట్లు తెలిపారు. ఆ అనుభవంతో సముద్రగర్భంలో ఎలా ఉంటుందో చూపించేందుకు.. ఎక్స్ పెడిషన్ : బిస్ మర్క్, ఘోస్ట్స్ ఆఫ్ ది అబేస్ అండ్ ఏలియన్స్ ఆఫ్ ది డీప్ డాక్యుమెంటరీలను కూడా తీశారు. ఓడ మునిగిపోయిన ప్రాంతాన్ని చూడాలన్న కోరితోనే టైటానిక్ ను తెరకెక్కించానని, అంతకుమించి ప్రత్యేకంగా దాన్నొక సినిమాగా తీసే ఉద్దేశం కాదన్నారు. 1995లో తొలిసారి ఓ రష్యన్ సబ్ మెరైన్ లో ప్రయాణించి టైటానిక్ మునిగిపోయిన ప్రాంతాన్ని జేమ్స్ కామెరూన్ వీడియో చిత్రీకరించి తీసుకొచ్చారు. 1912 ఏప్రిల్ 15న నార్త్ అట్లాంటిక్ సముద్రంలో ఒక ఐస్ బర్గ్ ను ఢీ కొని సముద్రగర్భంలో మునిగిపోయిన ఈ ఘోర ప్రమాదంలో 1500 మంది జలసమాధి అయ్యారు.
తాజాగా జరిగిన టైటానిక్ జలాంతర్గామి ప్రమాదంపై ఆయన అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఈ సబ్ మెరైన్ లో భద్రత గురించిన విషయాలను మరచిపోయారని, దాని కారణంగానే ఐదుగురు మరణించారన్నారు. ఈ ఘటన 1912లో జరిగిన టైటానిక్ షిప్ ప్రమాదాన్ని గుర్తు చేసిందన్నారు. హెచ్చరికలను పట్టించుకోకుండా జలాంతర్గామిలో టైటానిక్ శకలాల వద్దకు వెళ్లడం.. ఇంతటి విషాదాన్ని మిగిల్చిందన్నారు.


Tags:    

Similar News