బొగ్గు గనిలో అగ్ని ప్రమాదం.. 52 మంది మృతి

రష్యాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 52 మంది మృతి చెందారు. రష్యాలోని సైబీరియాలోని ఒక బొగ్గుగనిలో ఈ ఘటన జరిగింది;

Update: 2021-11-26 03:45 GMT
russia, coal mine, fire accident, deaths
  • whatsapp icon

రష్యాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 52 మంది మృతి చెందారు. రష్యాలోని సైబీరియాలోని ఒక బొగ్గుగనిలో ఈ ఘటన జరిగింది. సైబీరియాలోని కెమెరోవో బొగ్గుగనిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 52 మంది కార్మికులు, సెక్యూరిటీ అధికారులు కూడా మృతి చెందారు. ఇంకా అనేక మంది మరణించి ఉండవచ్చని పోలీసులు చెబుతున్నారు.

285 మంది....
బొగ్గు గనిలో చిక్కుకున్న వారిని బయటకు తీసే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈప్రమాదంలో లోపల ఉన్న వారు బతికి బయటపడటం కష్టమేనని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రమాదం జరిగిన సమయంలో బొగ్గుగనిలో మొత్తం 285 మంది ఉన్నట్లు హాజరు పట్టిక ప్రకారం గుర్తించారు. వారిని వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.


Tags:    

Similar News