తాలిబన్ల డేరింగ్ డెసిషన్.. 210 మంది ఖైదీల విడుదల

ఆప్ఘనిస్థాన్ లో తాలిబన్ల రాజ్యం వచ్చి మూడు నెలలు దాటుతుంది. వారు ప్రజలను హింసిస్తున్నారని అంతర్జాతీయ సమాజం ఘోషిస్తుంది

Update: 2021-11-30 06:00 GMT

ఆప్ఘనిస్థాన్ లో తాలిబన్ల రాజ్యం వచ్చి మూడు నెలలు దాటుతుంది. శాంతిభద్రతల పేరిట తాలిబన్లు ప్రజలను హింసిస్తున్నారని అంతర్జాతీయ సమాజం ఘోషిస్తుంది. అయినా తాలిబన్లు మాత్రం తాము ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. దేశంలో తమ ప్రత్యేక చట్టాలనే అమలు కావాలని కోరుకుంటున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో దేశంలో జైలులో ఉన్న 210 మంది ఖైదీలను విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది.

హింస మరింత....
ఆప్ఘనిస్థాన్ లో ప్రస్తుతం శాంతిభద్రతలు లేవు. ప్రజలు దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే దేశంలో వివిధ జైళ్లలో ఉన్న ఉగ్రవాదులను తాలిబన్లు విడుదల చేశారు. మిలిటెంట్లను విడుదల చేయడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతుంది. దీంతో దేశంలో హింస మరింత చెలరేగే అవకాశముందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. రష్యా వార్తా సంస్థ స్పుత్నిక్ ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేసింది.


Tags:    

Similar News