పాక్ లో విషాదం.. వారి చేతిలో 23 మంది మృతి
పాకిస్థాన్ లో విషాదం చోటు చేసుకుంది. సాయుధులైన వారి చేతిలో 23 మంది మరణించారు
పాకిస్థాన్ లో విషాదం చోటు చేసుకుంది. ముసుగులు ధరించిన కొందరు యువకులు వాహనాల్లో ప్రయాణిస్తున్న వారిని టార్గెట్ చేశారు. రహదారిపై నిల్చుని వాహనాలను అడ్డగించి వారిని అందులో నుంచి దింపేసి కాల్చేశారు.ఈ ఘటనలో ఇరవై మూడు మంది ప్రయాణికులు మరణించారు. పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ లోని ముసాఖెల్ జిల్లాలో సోమవారం ఈ ఘటన జరిగింది. కొందరు యువకులు ముసుగులు వేసుకుని రహదారిపై వస్తున్న బస్సుల్ని, ట్రక్కుల్ని ఆపారు.
గుర్తింపు కార్డులను...
అందులో వారి గుర్తింపు కార్డులను తనిఖీ చేశారు. తర్వాత వారిపై విచక్షణ రహితంగా కాల్పులు జరపడతో 23 మంది ప్రయాణికులు మరణించారు. అయితే పంజాబ్ ప్రావిన్స్ ప్రయాణికులే లక్ష్యంగా ఈ దాడి జరిగిందని చెబుతున్నారు. బలూచిస్థాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్టీ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎవరు కాల్పులు జరిపారన్న దానిపై దర్యాప్తు చేస్తామని తెలిపారు. ఈ ఘటనను పోలీసు ఉన్నతాధికారులు కూడా ధృవీకరించారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.