ట్రంప్ అనర్హుడే.. సంచలన తీర్పు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఊహించని షాక్ తగిలింది. అధ్యక్ష పదవికి;

donaldtrump Colorado court
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఊహించని షాక్ తగిలింది. అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు ఆయన అనర్హుడంటూ కొలరాడో సుప్రీంకోర్టు ప్రకటించింది. కొలరాడో ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది. 2021 నాటి యూఎస్ క్యాపిటల్ భవనంపై దాడికి సంబంధించిన కేసులో కోర్టు ఈ తీర్పును వెలువరించింది. అమెరికా చరిత్రలో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఓ నేతపై అనర్హత వేటు పడిన రికార్డు కూడా డొనాల్డ్ ట్రంప్ ఖాతాలోకే పడింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్రంప్ హింసను ప్రేరేపించారనడానికి బలమైన సాక్ష్యాలున్నాయని కోర్టు తెలిపింది. దీంతో అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ సెక్షన్ 3 ప్రకారం.. ఆయన అధ్యక్షుడిగా పోటీ చేసేందుకు అనర్హుడని తెలిపింది కోర్టు. ఈ తీర్పుపై యూఎస్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశాన్ని ట్రంప్‌కు న్యాయస్థానం కల్పించింది.