DIRTIEST MAN: ప్రపంచంలోనే అత్యంత మురికి వ్యక్తి కన్నుమూత.. ఎలా చనిపోయాడంటే..?

Update: 2022-10-26 02:29 GMT

దశాబ్దాలుగా స్నానం చేయని కారణంగా "ప్రపంచంలోని అత్యంత మురికి మనిషి" అని పేరుపొందిన ఇరాన్ వ్యక్తి అమౌ హాజీ కన్నుమూశారు. ఆయన వయస్సు 94. ఆదివారం డేజ్‌గా గ్రామంలో మరణించినట్లు న్యూయార్క్ పోస్ట్ ప్రభుత్వ మీడియాను ఉటంకిస్తూ నివేదించింది. అమౌ హాజీ నీటికి భయపడి 60 ఏళ్లుగా స్నానం చేయలేదు. అక్టోబరు 23న (ఆదివారం) ఇరాన్‌లోని దక్షిణ ప్రావిన్స్ ఫార్స్‌లోని డెజ్‌గా గ్రామంలో తుదిశ్వాస విడిచినట్లు మీడియా సంస్థలు తెలిపారు. హాజీ ఒంటరిగా నివసిస్తూ ఉండేవాడు. అనారోగ్యానికి గురవుతాననే భయంతో స్నానం చేయడం మానుకున్నాడు. అయితే కొద్ది నెలల క్రితం అతడికి గ్రామస్తులు బలవంతంగా స్నానం చేయించారు. హాజీపై 2013లో ఓ డాక్యుమెంటరీ కూడా వచ్చింది. 60 ఏళ్లుగా స్నానానికి దూరమై మురికితో పూర్తిగా దుమ్ముకొట్టుకుపోయిన హాజీకి ఇటీవల గ్రామస్థులందరూ కలిసి బలవంతంగా స్నానం చేయించారు. అది జరిగిన కొన్ని రోజులకే ఆయన మృతి చెందాడు.

హాజీ ఒక గుడిసెలో నివసించేవాడు.అతను తన యవ్వనంలో కొన్ని భావోద్వేగపరమైన ఎదురుదెబ్బలు ఎదుర్కొన్నాడు. దీంతో అతడు నీరు లేదా సబ్బుతో స్నానం చేయకుండా నివసించాడు. టెహ్రాన్ టైమ్స్‌లో ప్రచురించబడిన ఒక నివేదికలో హాజీ మాంసం తింటాడని, జంతువుల విసర్జనతో నిండిన పైపుతో పొగతాడాడని.. పరిశుభ్రత అతన్ని అనారోగ్యానికి గురి చేస్తుందని నమ్ముతున్నాడని పేర్కొంది. సోషల్ మీడియాలోని కొన్ని చిత్రాలలో అతను ఒకేసారి చాలా సిగరెట్లు తాగుతున్నట్లు చూపిస్తున్నాయి.
హాజీ చనిపోవడంతో.. జీవితకాలంలో అత్యధిక కాలం స్నానం చేయని వ్యక్తి రికార్డు ఇప్పుడు అనధికారికంగా భారతీయుడి సొంతమైంది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి శివారులోని ఓ గ్రామానికి చెందిన కైలాశ్ 'కాలౌ' సింగ్ (63) 30 ఏళ్లుగా స్నానానికి దూరంగా ఉన్నట్టు 2009లో 'హిందూస్థాన్ టైమ్స్' ఓ కథనంలో పేర్కొంది. దీనిని బట్టి ఇప్పటికి 44 ఏళ్లుగా ఆయన స్నానానికి దూరంగా ఉన్నాడు.


Tags:    

Similar News