#RRRకి అజయ్ దేవగన్ ఓకే చెప్పడానికి కారణం ఇదే..!

టాలీవుడ్ మోస్ట్ క్రేజీ మల్టీ స్టారర్ #RRR షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రామోజీ ఫిలిం సిటీలో రామ్ చరణ్ పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు రాజమౌళి. [more]

;

Update: 2019-02-14 10:19 GMT
ajay devagan acting in rrr
  • whatsapp icon

టాలీవుడ్ మోస్ట్ క్రేజీ మల్టీ స్టారర్ #RRR షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రామోజీ ఫిలిం సిటీలో రామ్ చరణ్ పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు రాజమౌళి. ఇదిలా ఉంటే ఇందులో విలన్ ఎవరు? హీరోయిన్స్ ఎవరు? అనేది మాత్రం ఎక్కడా బయటికి రాకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు జక్కన్న. తాజా సమాచారం ప్రకారం ఇందులో విలన్ పాత్ర చేసేందుకు బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఓకే చేసాడని టాక్. అయితే ఈ వార్తల్లో నిజం లేదని కొంతమంది చెబుతున్నారు. రాజమౌళి అడిగినప్పుడు తనకు రాని భాషల్లో నటించలేనని చెప్పాడని టాక్.

నిజంగానే చేస్తున్నాడా..?

ఇందులో నిజం లేకపోలేదు. ఎందుకంటే శంకర్ ఇండియన్ 2కి అడిగినప్పుడు అజయ్ దేవగన్ ఈ కారణం చెప్పే నో అన్నాడు. అయితే మరో ఫ్రెష్ అప్ డేట్ ఏంటంటే అజయ్ దేవగన్ ఇందులో కీలకమైన ఒక క్యామియో రోల్ చేస్తున్నాడట. ఆయన పాత్ర కనిపించేది కొన్ని నిమిషాలే అయినప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోతుందట. ఈ పాత్రకి రెండు మూడు రోజులు కాల్ షీట్స్ ఇస్తే చాలని చెప్పడంతో అజయ్ దేవగన్ చేయడం దాదాపు పక్కా అని బాలీవుడ్ టాక్. మరి ఇందులో ఎంతరకు నిజముందో తెలియాలంటే జక్కన్న నోరు విప్పాల్సిందే.

Tags:    

Similar News