రావణ్ గా సైఫ్.. మరి శివుడిగా?

ప్రభాస్ పుట్టిన రోజు కి ఆయనతో సినిమాలు చేస్తున్న దర్శకనిర్మాతలు పడి పడి అప్ డేట్స్ ఇచ్చేస్తున్నారు. నిన్న నాగ్ అశ్విన్ ప్రభాస్ తో చెయ్యబోయే సినిమాలో [more]

;

Update: 2020-10-10 16:21 GMT
Prabhas Adi Purush
  • whatsapp icon

ప్రభాస్ పుట్టిన రోజు కి ఆయనతో సినిమాలు చేస్తున్న దర్శకనిర్మాతలు పడి పడి అప్ డేట్స్ ఇచ్చేస్తున్నారు. నిన్న నాగ్ అశ్విన్ ప్రభాస్ తో చెయ్యబోయే సినిమాలో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ ని దింపబోతున్నట్టుగాప్రకటించేసాడు. ఇక ఆదిపురుష్ కోసం దర్శకుడు ఓం రనౌత్ ప్లాన్స్ కూడా మాములుగా లేదు. అడపాదడపా సినిమాకి సంబందించిన న్యూస్ చెబుతూనే మధ్యలో అప్ డేట్స్ ఇస్తున్నారు. ఆదిపురుష్ ప్రకటించడమే తరువాయి.. విలన్ గా సైఫ్ అలీఖాన్ ని ఎంపిక చేసినట్టుగా ప్రకటించారు. ఇక బాలీవుడ్ నుండే హీరోయిన్ ని తీసుకురాబోతున్నారనే టాక్ ఉంది. ఇక ఆదిపురుష్ పురాణం గాధ రామాయణం బేస్ చేసుకుని తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీ లెవల్లో ఉన్నాయి.

అయితే రావణ్ పాత్రలో విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తుంటే.. ఈ సినిమాలో అతి ముఖ్యమైన శివుడుపాత్రకి మరో బాలీవూడ్ హీరోని ఆదిపురుష్ టీం సంప్రదించినట్టుగా బాలీవుడ్ మీడియా టాక్. ఆదిపురుష్ లో శివుడుపాత్రకి బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ని మూవీ టీం సంప్రదిస్తున్నదని.. విలన్ రావణ్ పాత్రకే అజయ్ దేవగన్ ని సంప్రదించగా.. అజయ్ దేవగన్ కి డేట్స్ అడ్జెస్ట్మెంట్ లేకపోవడంతో ఆ పాత్ర కే సైఫ్ ని తీసుకున్నారట. కానీ శివుడి పాత్రకి మాత్రం అజయ్ నే బ్రతిమాలుతుందట మూవీ టీం. ఆదిపురుష్ దర్శకుడు ఓం రనౌత్ కి అజయ్ దేవగన్ కే ఉన్న స్నేహంతో శివుడి పాత్రకి  అజయ్ ని అడగగా… అజయ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలాగే కనబడుతున్నాడట.

Tags:    

Similar News