దేవగన్ కాదన్నాడు అక్షయ్ ని పెట్టేసాడు..!

టాలీవుడ్ లో మోస్ట్ క్రేజియెస్ట్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న భారీ చిత్రం #RRR. రామ్ చరణ్ – ఎన్టీఆర్ లతో తీస్తున్న ఈ సినిమాలో ఇంతవరకు విలన్ [more]

;

Update: 2019-02-11 07:01 GMT
#rrr movie update
  • whatsapp icon

టాలీవుడ్ లో మోస్ట్ క్రేజియెస్ట్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న భారీ చిత్రం #RRR. రామ్ చరణ్ – ఎన్టీఆర్ లతో తీస్తున్న ఈ సినిమాలో ఇంతవరకు విలన్ ఎవరు అనేది మాత్రం ఎక్కడా బయటికి రాలేదు. అందు కోసం రాజమౌళి పలువురు విలన్ల పేర్లను పరిశీలించారట. అందులో మొదటగా బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్ ఓ ఆప్షన్ అని తెలుస్తోంది. రాజమౌళి తీసిన ఈగ సినిమా హిందీ వెర్షన్ కి దేవగన్ – కాజోల్ డబ్బింగ్ చెప్పారు. సో ఆ చొరవతోనే అజయ్ దేవగన్ ని రాజమౌళి సంప్రదించారట. మరి ఏమైందో ఏంటో తెలియదు కానీ ఈ ప్రాజెక్ట్ చేయడానికి దేవగన్ నో చెప్పాడట.

ఓకే చెప్పిన అక్షయ్ కుమార్

కారణాలు ఏంటో తెలియదు కానీ దేవగన్ ప్రస్తుతం ఎక్కువ లావుగా ఉండడమే అందుకు కారణం అంటున్నారు. దేవగన్ అలా నో చెప్పాడో లేడో వెంటనే అక్షయ్ లైన్ లో కి వచ్చేసాడు. రాజమౌళి వెళ్లి అక్షయ్ ని సంప్రదించగా వెంటనే ఓకే చెప్పేశాడట. ఒకవేళ అక్షయ్ కుమార్ ఓకే చేస్తే రెండో అతిపెద్ద సౌత్ సినిమా అవుతుంది. ఇక అజయ్ దేవగన్ ఇదివరకు 'భారతీయుడు 2' ఆఫర్ ని కాదనుకున్నారు. ఇప్పుడు #RRR. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటినుండే అంచనాలు పెరిగాయి. హీరోయిన్స్ ని ఫైనల్ చేయాల్సిన అవసరం ఉంది.

Tags:    

Similar News