రెండు నెలలు సమయం అడిగిన బన్నీ..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా” సినిమా డిజాస్టర్ అవ్వడంతో చాలా గ్యాప్ తీసుకుని త్రివిక్రమ్ శ్రీనివాస్ తో [more]

Update: 2019-02-19 09:53 GMT

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా” సినిమా డిజాస్టర్ అవ్వడంతో చాలా గ్యాప్ తీసుకుని త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. త్వరలోనే ఈ కాంబినేషన్ లో సినిమా స్టార్ట్ కానుంది. పూజా కార్యక్రమం త్వరలో జరగనుంది. బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుందని టాక్. ఇది ఇలా ఉంటే నా పేరు సూర్య తరువాత ఏడాది గ్యాప్ తీసుకున్న బన్నీ చాలా వెయిట్ పెరిగాడు.

రెండు నెలలు టైమ్ ఇచ్చిన త్రివిక్రమ్

అందుకే త్రివిక్రమ్ బన్నీని వెయిట్ తగ్గమని కోరాడట. ప్రస్తుతం బన్నీ అందుకు సంబంధించిన కసరత్తులు కూడా స్టార్ట్ చేసాడు. అయినా ఇంకా వెయిట్ కనిపించడంతో మరో రెండు నెలలు టైం ఇచ్చాడట త్రివిక్రమ్. అంటే రెండు నెలలు తరువాతే వీరి సినిమా స్టార్ట్ కానుంది. ఈ మూవీని గీతా ఆర్ట్స్, హారిక హాసిని వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Tags:    

Similar News