"వండర్ ఉమెన్"గా నిత్యమీనన్.. 18 నుండి స్ట్రీమింగ్

మలయాళ దర్శకురాలు అంజలి మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పేరెంట్ హుడ్ మూవీ “వండర్ ఉమెన్”. తాజాగా ఈ సినిమా..;

Update: 2022-11-03 14:47 GMT
wonder women trailer, nithya menon, sony liv

wonder women trailer

  • whatsapp icon

టాలీవుడ్ లో విభిన్న కథలను ఎంచుకుంటూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి నిత్యామీనన్. సినిమాలే కాదు.. ఓటీటీ వెబ్ సిరీస్ లోనూ నటిస్తూ ఆడియన్స్ కు దగ్గరవుతోంది. మోడ్రన్ లవ్ హైదరాబాద్ వెబ్ సిరీస్ లో నటించిన నిత్యామీనన్..తాజాగా వండర్ ఉమెన్ తో రానుంది. రెండ్రోజుల క్రితం సోషల్ మీడియాలో నిత్య పెట్టిన పోస్ట్.. నెటిజన్లు, అభిమానులను షాకు గురిచేసింది. అదే ఫోటోను మలయాళ నటి పార్వతి కూడా కొద్దిసేపటికి షేర్ చేయడంతో ఇది ఏదో సినిమా ప్రమోషన్ కోసమని అర్ధమైంది.

మలయాళ దర్శకురాలు అంజలి మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పేరెంట్ హుడ్ మూవీ "వండర్ ఉమెన్". తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను నేడు విడుదల చేసింది మూవీ టీం. ట్రైలర్ ను బట్టి గర్భం దాల్చిన స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పుట్టిన పిల్లల పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలు చుట్టూ సినిమా కథ ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో గర్భిణిగా పార్వతి తిరువోతు, నిత్యా మీనన్, మరియు అమృతా సుభాష్‌లు కనిపించబోతున్నారు. నవంబర్ 18 నుండి సోనీలివ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది.


Tags:    

Similar News