అవతార్ 2 మూడురోజుల కలెక్షన్లు.. భారత్ లో 'డాక్టర్ స్ట్రేంజ్'ను దాటేసిన వసూళ్లు

ప్రపంచవ్యాప్తంగా 160 భాషల్లో 55 వేల థియేటర్లలో విడుదలైన అవతార్ 2.. ఒక్క భారత్ లోనే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ..

Update: 2022-12-19 10:29 GMT

Avatar 2 Collections

యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అవతార్ 2 గత శుక్రవారం విడుదలై.. విశేష ప్రేక్షక ఆదరణ పొందింది. విడుదలై నాలుగురోజులవుతున్నా థియేటర్ల వద్ద హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. 13 ఏళ్ల కిందట వచ్చిన మొదటి భాగంలో 'పండోరా' అందాలను చూపించి ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిన జేమ్స్ కామరూన్‌ ఇప్పుడు దానికి కొనసాగింపుగా 'అవతార్ ద వే ఆఫ్‌ వాటర్‌‌' తో నీటి అడుగు అందాల్ని, సముద్రంలో ఉండే భారీ జీవుల్ని, వాటి మమకారాలను, భావోద్వేగాలను చూపించి ప్రేక్షకులను తనవైపుకి తిప్పుకున్నారు.

ప్రపంచవ్యాప్తంగా 160 భాషల్లో 55 వేల థియేటర్లలో విడుదలైన అవతార్ 2.. ఒక్క భారత్ లోనే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నాలుగు వేలకు పైగా స్క్రీన్లను ఆక్రమించింది. కథ, కథనం విషయంలో జేమ్స్ తెలుగు సినిమాలను చూసి కాపీ కొట్టాడన్న వార్తలొస్తున్నా.. విజయవంతంగా ముందుకెళ్తోంది అవతార్ 2. ఇక తొలి మూడు రోజుల్లో అవతార్ 2 ప్రపంచ వ్యాప్తంగా రూ.3600 కోట్ల వసూళ్లు చేసినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నారు. భారత్ లో తొలి మూడ్రోజుల్లో.. రూ. 131–133 కోట్లు రాబట్టినట్టు తెలుస్తోంది. మరో హాలీవుడ్ మూవీ 'డాక్టర్ స్ట్రేంజ్'ను అవతార్ 2 దాటేసింది. 'డాక్టర్ స్ట్రేంజ్' సినిమా మొత్తంగా రూ.126 కోట్ల కలెక్షన్స్ తో భారత్ లో అత్యధిక వసూలు చేసిన హాలీవుడ్ చిత్రంగా నిలిచింది. ఇప్పుడు భారత్ లో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా అవతార్ 2 నిలిచింది.





Tags:    

Similar News