ముందు పవన్.. తర్వాతే ఎవరైనా!!

పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక చాలామంది దర్శకులు పవన్ కోసం కథలు రాసుకున్నారు. పవన్ సినిమాల్లోకి వస్తాడంటూ ప్రచారం జరుగుతున్నప్పుడే బోలెడంతమంది పవన్ కోసం [more]

Update: 2020-07-15 02:57 GMT

పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక చాలామంది దర్శకులు పవన్ కోసం కథలు రాసుకున్నారు. పవన్ సినిమాల్లోకి వస్తాడంటూ ప్రచారం జరుగుతున్నప్పుడే బోలెడంతమంది పవన్ కోసం కథలు తయారు చెయ్యడం మొదలెట్టారు. కానీ పవన్ ముందు వేణు శ్రీరామ్, తర్వాత క్రిష్, ఆ తర్వాత గబ్బర్ సింగ్ తో హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ కి కమిట్ అయ్యి మిగతా వాళ్ళని హోల్డ్ లో పడేసాడు. ఇప్పుడు వేణు శ్రీరామ్ ఎట్టకేలకు వకీల్ సాబ్ తో గట్టెక్కిసినట్టే. ఇక వకీల్ సాబ్ అవడమే తరువాయి క్రిష్ కోసం పవన్ వచ్చేస్తాడు. అంటే క్రిష్ కూడా సేఫ్. కానీ హారిష్ శంకర్ పరిస్థితి ఏంటో కానీ.. హరీష్ పవన్ కోసం స్క్రిప్ట్ రాస్తున్నా.. ఇక ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టా అని చెప్పాడు. అయితే కరోనా ప్రభావంతో పవన్ కళ్యాణ్ తో సినిమా లేట్ అయ్యేటట్టు ఉంది కాబట్టి పవన్ సినిమా కన్నా ముందు ఓ యంగ్ హీరో కోసం హరీష్ కథ మొదలెట్టడమే కాదు… ఆ అహీరో కోసం ప్రయత్నాలు కూడా మొదలెట్టినట్టుగా సోషల్ మీడియా టాక్.

అయితే ఆ ప్రచారంపై హరీష్ శనకర్ తాజాగా స్పందించాడు. పవన్ కళ్యాణ్ ఎప్పుడొచ్చినా.. అంటే ఎంత కాలం పట్టినా తాను పవన్ కోసమే వెయిట్ చేస్తా తప్ప మరో హీరోతో ముందు సినిమా చెయ్యను. అసలు నాకు అలాంటి ఆలోచనలే లేవు అని చెప్పడమే కాదు.. ప్రస్తుతం తన దృష్టి మొత్తం పవన్ సినిమాపైనే పెట్టా అని.. స్క్రిప్ట్ పక్కాగా పూర్తి చేసి పవన్ కోసం మిగతా పనులు పూర్తి చేసుకుంటా కానీ.. ఇప్పుడు మరో సినిమా గురించి అలోచించి.. పవన్ సినిమాని పాడు చేయలేనని తేల్చేసాడు. ఇక గబ్బర్ సింగ్ లగే పవన్ తో తాను చెయ్యబోయే సినిమా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఫాన్స్ కే కాదు.. మిగతా ప్రేక్షకులను ఉర్రుతలూగించడం ఖాయమని చెబుతున్నాడు. 

Tags:    

Similar News