శృతి హాసన్ దొంగా?

గత రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న శృతి హాసన్ ఇప్పుడిప్పుడే దర్శకనిర్మాతల  దృష్టిలో పడుతుంది. కరోనా లాక్ డౌన్ తో శృతి హాసన్ రకరకాల వంటలు, వర్కౌట్స్ [more]

Update: 2020-05-28 06:51 GMT

గత రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న శృతి హాసన్ ఇప్పుడిప్పుడే దర్శకనిర్మాతల  దృష్టిలో పడుతుంది. కరోనా లాక్ డౌన్ తో శృతి హాసన్ రకరకాల వంటలు, వర్కౌట్స్ అంటూ కుస్తీలు పడుతుంది. మధ్య మధ్యలో అభిమానులకు అందుబాటులో ఉంటుంది. అభిమానులతో చిట్ చాట్ చేస్తూ తన వ్యక్తిగత విషయాలతో పటు కెరీర్ కి సంబందించిన విషయాలను పంచుకుంటుంది. తాజాగా ఇన్స్టా లైవ్ చాట్ లో అభిమానులల్తో ముచ్చటించింది. లాక్ డౌన్ లో ఏం నేర్చుకున్నారు అని శృతి ని ఓ అభిమాని అడగగా.. దానికి శృతి హాసన్ ఈ సృష్టిలో ఏ విషయం మన నియంత్రణలో ఉండదు. ఆ విషయాన్ని తెలుసుకుని మెలగండి అని చెబుతుంది. ఇక మీ అందానికి వెనుకున్న రహస్యం అని అడగగా… నేను ఎప్పుడూ వర్కౌట్స్ చేస్తుంటాను, అలాగే నీళ్లు ఎక్కువగా తాగుతుంటాను.. ఇదంతా ఒకరకంగా నా తల్లి తండ్రులనుండి నేర్చుకున్నాను అని చెబుతుంది.

ఇక ఎప్పుడైనా దొంగతనము చేశారా అని అడగగా.. చిన్నప్పుడు తెలియని వయసులో క్యాండీస్ ని కొట్టేసా అని… కానీ నేను చేసిన దొంగతనాన్ని నాన్న కమల్ కనిపెట్టేసి.. ఆ షాప్ యజమానికి మల్లి చాకోలేట్ పాకెట్స్ తిరిగి ఇచ్చెయ్యడమే కాకుండా ఆ షాప్ యజమానికి నాతో క్షమాపణ చెప్పించడంతో బాగా సిగ్గుపడ్డా అని తాను చేసిన చిలిపి దొంగతనాన్ని బయటపెట్టింది. ఇక జీవితంలో మరెప్పుడూ దొంగతనం చెయ్యకూడదని అప్పుడే నిచ్ఛయించుకున్నా అని చెబుతుంది. ఇక రవితేజ తో తాను నటిస్తున్న క్రాక్ సినిమా ముచ్చట్లను పంచుకుంది. క్రాక్ సినిమా చిత్రీకరణ కొద్దిగా మిగిలి ఉందని.. లాక్ డౌన్ ముగియగానే ఆ కొద్దిపాటి చిత్రీకరణ పూర్తి చేస్తామని చెప్పింది.

Tags:    

Similar News