కళాతపస్వి కె.విశ్వనాథ్ అంత్యక్రియలు పూర్తి..ప్రధాని సహా పలువురి నివాళి
పంజాగుట్ట శ్మశానవాటికలో కొద్దిసేపటి క్రితం విశ్వనాథ్ భాతిక కాయానికి అంత్యక్రియలు ముగిశాయి. బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం..
భారత సినీ పరిశ్రమ గర్వించదగిన దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ ఫిబ్రవరి 2వ తేదీ రాత్రి.. అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన తీసిన సంగీత కావ్యం.. శంకరాభరణం సినిమా రిలీజైన రోజే విశ్వనాథ్ కన్నుమూయడం పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి చెందారు. ప్రధాని నరేంద్రమోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా.. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మరణం పట్ల సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆయన నివాసం నుండి అంతిమయాత్ర మొదలైంది.
పంజాగుట్ట శ్మశానవాటికలో కొద్దిసేపటి క్రితం విశ్వనాథ్ భాతిక కాయానికి అంత్యక్రియలు ముగిశాయి. బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు.. అభిమానులు తరలివచ్చి కడసారి నివాళులు అర్పించారు. సినీ కళామతల్లికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన తీసిన సినిమాలకు ఫిలింఫేర్, నంది అవార్డులతో పాటు.. పలు ప్రపంచ రికార్డులనూ సృష్టించారు.
నోబెల్ వరల్డ్ రికార్డు, ఫిలిం వరల్డ్ రికార్డు, ఆస్కార్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, బయోగ్రఫీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, భారత్ వరల్డ్ రికార్డు, టాలెంట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో ఆయన పేరు నమోదు చేసినట్లు ప్రపంచ రికార్డుల భారత ప్రతినిధి కెవి రమణారావు గతంలో వెల్లడించారు