ప్రముఖ యువనటుడు కన్నుమూత

ఆ తర్వాత.. ముత్తినంత హెంతి, కేరళిద కేసరి, నిశ్శబ్ధ, చిరబండవ్య వంటి సినిమాల్లో కూడా నితిన్‌ నటించారు.;

Update: 2023-06-03 08:59 GMT
actor nithin gopi dead, nithin gopi movies

actor nithin gopi dead

  • whatsapp icon

చిన్న, పెద్ద తేడా లేకుండా ఇటీవల కాలంలో చాలా మంది ఆకస్మికంగా గుండెపోటుతో మరణిస్తున్నారు. స్కూల్ కు వెళ్లే పిల్లలు మొదలు.. ఆరుపదుల వయసు దాటిన వృద్ధుల వరకూ ఇలాంటి మరణాలే అధికంగా చోటుచేసుకుంటున్నాయి. ఇండస్ట్రీకి చెందిన నటులు కూడా గుండెపోటుతో మరణిస్తున్నారు. తాజాగా మరో యువనటుడు గుండెపోటుతో మరణించాడు. కన్నడ సినీ పరిశ్రమకు చెందిన నితిన్ గోపీ గుండెపోటుతో మృతి చెందాడు. అతని వయసు కేవలం 39 సంవత్సరాలు కావడం గమనార్హం.

చైల్డ్ ఆర్టిస్టుగా వెండితెరకు పరిచయమైన నితిన్ గోపీ.. నటుడు డాక్టర్ విష్ణువర్థన్ తో కలిసి హలో డాడీ సినిమాలో విష్ణువర్థన్ కుమారుడి పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత.. ముత్తినంత హెంతి, కేరళిద కేసరి, నిశ్శబ్ధ, చిరబండవ్య వంటి సినిమాల్లో కూడా నితిన్‌ నటించారు. భక్తి సీరియల్‌ హర హర మహాదేవ్‌లో కొన్ని ఎపిసోడ్స్‌లో కూడా కనిపించారు. కన్నడ, తమిళ్‌ భాషల్లో సూపర్‌హిట్‌గా నిలిచిన కొన్ని ధారావాహికల్లోనూ నితిన్ తన నటనతో మెప్పించారు. ఇటీవల ధృవనక్షత్రం అనే సీరియల్ కు దర్శకత్వం కూడా వహించారు. మరో సీరియల్ ను తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. ఇంతలోనే గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. యువనటుడి అకాల మరణంతో శాండల్‌వుడ్‌ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. నితిన్ గోపీ మరణం పట్ల ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలిపారు.


Tags:    

Similar News