కార్తికేయ 2 డిజిటల్ హక్కుల్ని ఏ ఓటీటీ సంస్థ దక్కించుకుంది ? స్ట్రీమింగ్ ఎప్పుడు ?
మొదటి రోజు కాస్త వడివడిగానే కలెక్షన్లొచ్చినా.. నాల్గవరోజుకి స్క్రీన్ కౌంట్ మూడింతలయింది. కంటెంట్ ఉంటే.. ఇక ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కుల
రెండువారాలుగా టాలీవుడ్ లో సందడి నెలకొంది. వరుసగా విడుదలవుతున్న చిత్రాలు హిట్ అవుతున్నాయి. ఆగస్టు 5న విడుదలైన బింబిసార, సీతారామం చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుని, ఇప్పటికీ థియేటర్లలో రన్ అవుతున్నాయి. ఇక ఇటీవల విడుదలైన మాచర్ల నియోజకవర్గం, కార్తికేయ 2 సినిమాల్లో మాచర్ల నియోజకవర్గం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. రొటీన్ స్టోరీగానే ఉందని, సినిమాలో కొత్తగా ఏం చూపించలేదని ప్రేక్షకుల అభిప్రాయం. కార్తికేయ 2 మాత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ టాక్ సంపాదించుకుంది.
మొదటి రోజు కాస్త వడివడిగానే కలెక్షన్లొచ్చినా.. నాల్గవరోజుకి స్క్రీన్ కౌంట్ మూడింతలయింది. కంటెంట్ ఉంటే.. కలెక్షన్లకు అడ్డేది ఉండదని ఈ సినిమా నిరూపించింది. తెలుగులోనే కాకుండా.. ఇతర భాషల్లోనూ కార్తికేయ 2 భారీ వసూళ్లు రాబడుతోంది. ఇక ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కుల విషయానికొస్తే.. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 డిజిటల్ హక్కులను భారీ రేటుకు కొనుగోలు చేసినట్లు ఓ వార్త వైరల్ అవుతోంది. సినిమా విడుదలైన ఆరువారాలకు ఓటీటీలో విడుదల కానుంది. ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని జీ5 సంస్థ త్వరలోనే ప్రకటించనుంది. కార్తికేయ 2 సినిమాతో హీరో నిఖిల్ సిద్ధార్థ్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది.