సినిమా టికెట్ ధరలపై నేడు కీలక భేటీ

సినిమా టికెట్ ధరలపై ఏర్పాటైన కమిటీ.. ఈ రోజు ఉదయం 11.30 గంటలకు సమావేశం కానుంది. ఈ భేటీ తర్వాత;

Update: 2022-02-17 05:14 GMT
సినిమా టికెట్ ధరలపై నేడు కీలక భేటీ
  • whatsapp icon

ఏపీలో సినిమా టికెట్ ధరల విషయం నేడు ఓ కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. సినిమా టికెట్ ధరలపై ఏర్పాటైన కమిటీ.. ఈ రోజు ఉదయం 11.30 గంటలకు సమావేశం కానుంది. ఈ భేటీ తర్వాత టికెట్ ధరలపై కమిటీ ప్రభుత్వానికి ఓ నివేదికను అందించనుంది. ఇప్పటికే టికెట్ల ధరల ప్రతిపాదనలు సిద్ధమైనట్లు సమాచారం. కొత్త ధరలతో ఈ నెల 25న విడుదలవుతున్న భీమ్లానాయక్, గని సినిమాలకు లాభం చేకూరనుందని తెలుస్తోంది.

Also Read : బర్నింగ్ టాపిక్... వైసీపీలో ఆ ఒక్కరూ ఎవరు?
కాగా.. ఈనెల 10వ తేదీన తెలుగు సినిమా ప్రముఖులతో సీఎం జగన్.. తన క్యాంప్ కార్యాలయంలో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ భేటీలో సీఎం జగన్.. సినీ పరిశ్రమను విశాఖకు తీసుకురావాలని సినీ పెద్దలకు చెప్పారు. విశాఖకు పరిశ్రమ వస్తే.. అక్కడ అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని, స్టూడియోలు పెట్టేవారికి కూడా స్థలాలను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. జూబ్లీహిల్స్ తరహా ప్రాంతాన్ని విశాఖలో అభివృద్ధి చేద్దామని సీఎం జగన్ సూచించారు.


Tags:    

Similar News