నాది నేనె కాపీ కొట్టా అంటున్నాడు

బాలీవుడ్ లో ఫెమస్ ఫోటో గ్రాఫర్ అయిన డబూ రత్నానీ ప్రతి ఏడాది తన పేరుతోనే బాలీవుడ్ లో అందమైన భామలతో హాటెస్ట్ ఫోటో షూట్స్ తో [more]

Update: 2020-02-25 06:00 GMT

బాలీవుడ్ లో ఫెమస్ ఫోటో గ్రాఫర్ అయిన డబూ రత్నానీ ప్రతి ఏడాది తన పేరుతోనే బాలీవుడ్ లో అందమైన భామలతో హాటెస్ట్ ఫోటో షూట్స్ తో అందమైన కేలెండర్ ని తయారు చేసి గ్రాండ్ గా విడుదల చేస్తుంటాడు. ఎప్పటిలాగే ఈఏడాది కూడా హీరోయిన్స్ ని రకరకాల హాట్ భంగిమల్లో ఫోటో షూట్ చేసి మరీ అద్భుతమైన, అందమైన హాటెస్ట్ కేలెండర్ విడుదల చేసాడు. అందులో భామలంతా గ్లామర్ గా కాదు… ఒంటి మీద ఒక్క నూలు పోగు లేకుండా… ఏవేవో అడ్డుపెట్టుకున్న ఫోటో షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే అందులో ప్రత్యేకంగా ప్రస్తుతం టాప్ గేర్లో దూసుకుపోతున్న కియారా అద్వానీ ఆకుచాటు అందం హైలెట్ అయింది. అరటి ఆకును పోలిన క్రోటన్ ఆకు చాటున కియారా అద్వానీ బట్టలు లేకుండా చేయించుకున్న ఫోటో షూట్ అందరిని ఆకట్టుకుంది.

అదే సమయంలో సోషల్ మీడియాలో నెటిజెన్స్ ఈ కియారా ఆకుచాటు ఫోటోషూట్‌ను డబూ రత్నానీ.. స్టేఫ్ టైలర్ లుక్‌ను కాపీ కొట్టాడంటూ కామెంట్స్ చెయ్యడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరోపక్క డబూ రత్నానీ 2001 లో టబుతో కొబ్బరి ఆకుతో చేసిన ఫోటో పక్కన కియారా 2020 ఆకు లుక్ ని పెట్టి తెగ వైరల్ చేస్తున్నారు. అయితే నెటిజెన్స్ అన్నట్టుగా నేను స్టేఫ్ టైలర్ లుక్‌ను కాపీ కొట్టాననే వార్తల్లో నిజం లేదు కానీ.. 2001 లో ఎంతో అందమైన టబు ని నా కెమెరాలో బంధించాను. ఈ లుక్‌నే 2002 క్యాలెండర్‌ కోసం ఉపయోగించాను. ఇక కియారా ఫోటో షూట్స్ పై వస్తున్న ట్రోల్స్ నిజం కాదు.. నేను వేరే వాళ్ళని కాపీ కొట్టలేదు. నా ఓల్డ్ లుక్ ని నేనె కాపీ కొట్టా అంటూ డబూ రత్నానీ క్లారిటీ ఇచ్చాడు.

Tags:    

Similar News