రామ్ సరసన ఉప్పెన బ్యూటీ?

ఉప్పెన సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ఆ సినిమా కోస్తున్న కలెక్షన్స్ చూస్తే తెలుస్తుంది. బుచ్చి బాబు సాన దర్శకత్వంలో హీరో హీరోయిన్స్ గా పరిచయం [more]

Update: 2021-02-20 09:06 GMT

ఉప్పెన సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ఆ సినిమా కోస్తున్న కలెక్షన్స్ చూస్తే తెలుస్తుంది. బుచ్చి బాబు సాన దర్శకత్వంలో హీరో హీరోయిన్స్ గా పరిచయం అయిన వైష్ణవ్ తేజ్ – కృతి శెట్టిలు ఓవర్ నైట్ స్టార్స్ ని చేసింది ఉప్పెన సక్సెస్. ఉప్పెన సినిమా విడుదల కాక ముందు నుండే ఉప్పెన లో నటిస్తున్న హీరోయిన్ పై టాలీవుడ్ కన్ను పడింది. ట్రెడిషనల్ గా కృతి శెట్టి లుక్స్ కి పడిపోయిన యంగ్ హీరోస్ కృతి ని తమ సినిమాల్లో లాక్ చేసేస్తున్నారు. ఇప్పటికే నాని, సుధీర్ బాబు లు తమ సినిమాల్లో హీరోయిన్ గా కృతి శెట్టి ని లాక్ చేసేసారు. ఉప్పెన బేబమ్మగా దూసుకొచ్చిన బాణం ఇప్పుడు టాలీవుడ్ ని ఏలడానికి రెడీగా ఉందనిపిస్తుంది.. ఆమె లక్కు చూస్తుంటే.
తాజాగా ఉప్పెన బేబమ్మకి మరో ఆఫర్ తగిలింది. అది కూడా తెలుగు తమిళ్ లో ఒకేసారి తెరకెక్కబోతున్న మూవీ కోసం కృతి శెట్టి ని మూవీ టీం అప్రోచ్ అయినట్లుగా.. కృతి శెట్టి కూడా సానూకూలంగా ఉన్నట్లుగా న్యూస్ మొదలయ్యింది. రెడ్ తర్వాత తమిళ్ దర్శకుడు లింగుస్వామితో రామ్ ఓ బైలింగువల్ మూవీ ని పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టిన విషయం తెలిసిందే. అయితే తెలుగు, తమిళ్ ఒకేసారి తెరకెక్కనున్న మూవీలో రామ్ సరసన కృతి శెట్టి ఆల్మోస్ట్ ఫిక్స్ అంటున్నారు. మరి ఇప్పుడు కృత్ శెట్టి కి వస్తున్నా ఆఫర్స్ చూసిన వారంతా బేబమ్మ స్పీడుకి ఇప్పట్లో బ్రేకులుండవ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

Tags:    

Similar News