ఓటీటీలోకి మాచర్ల నియోజకవర్గం.. స్ట్రీమింగ్ డేట్ చెప్పిన సంస్థ
కొత్తగా విడుదలైన ఏ సినిమా అయినా.. 50 రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తుంది. కొన్ని సినిమాలైతే 50 రోజుల లోపే ఓటీటీ
టాలీవుడ్ లో వరుస ఫ్లాపులతో ఉన్న హీరోల లిస్ట్ లో నితిన్ కూడా ఉన్నాడు. చెక్, రంగ్ దే, మ్యాస్ట్రో ఇలా వరుస ఫ్లాపులతో ఉన్న నితిన్.. మాచర్ల నియోజకవర్గం పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ ఏడాది ఆగస్టు 12న విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ ను అలరించలేకపోయింది. అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కి ముందు మంచి హైప్ ఉన్నా.. కథ రొటీన్ గా ఉండటంతో బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఒకటి రెండు పాటలు మాత్రం సక్సెస్ అయ్యాయి.
కొత్తగా విడుదలైన ఏ సినిమా అయినా.. 50 రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తుంది. కొన్ని సినిమాలైతే 50 రోజుల లోపే ఓటీటీ బాట పడుతున్నాయి. కానీ.. మాచర్ల నియోజకవర్గం విడుదలై నాలుగు నెలలైనా ఇంకా ఓటీటీలోకి రాలేదు. తాజాగా ఆ సినిమా గురించి అప్డేట్ ఇచ్చింది జీ5 సంస్థ. డిసెంబర్ 9 నుండి మాచర్ల నియోజకవర్గం సినిమాను జీ5 లో స్ట్రీమింగ్ చేయున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నితిన్ సరసన కృతిశెట్టి నటింజగా.. ప్రముఖ నటి గీతాంజలి స్పెషల్ సాంగ్ లో కనిపించింది.