అవతార్ 2 సినిమా చూస్తూ వ్యక్తి మృతి

కొందరు వ్యక్తులు హార్రర్ సినిమాలు చూస్తూ.. గుండెపోటుకు గురై మరణించిన ఘటనలున్నాయి. కానీ.. అవతార్ 2 లో ..;

Update: 2022-12-17 09:31 GMT
avatar 2, peddapuram, heart attack

lakshmireddy srinu

  • whatsapp icon

అవతార్ 2 సినిమా చూస్తూ ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాద ఘటన కాకినాడ జిల్లా పెద్దాపురంలో వెలుగుచూసింది. లక్ష్మిరెడ్డి శ్రీను అనే వ్యక్తి తన తమ్ముడు రాజుతో కలిసి అవతార్-2 సినిమాకు వెళ్లాడు. సినిమా చూస్తుండగా అతనికి గుండెపోటు వచ్చింది. ఉన్నట్టుండి నొప్పితో విలవిల్లాడటంతో.. వెంటనే రాజు పెద్దాపురం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాడు. కానీ ఫలితం లేకపోయింది. శ్రీను అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్థారించారు.

కొందరు వ్యక్తులు హార్రర్ సినిమాలు చూస్తూ.. గుండెపోటుకు గురై మరణించిన ఘటనలున్నాయి. కానీ.. అవతార్ 2 లో అలాంటి హార్రర్ సన్నివేశాలేమీ లేవు. ఆ విజువల్ ఎఫెక్ట్స్ చూసి కొందరు అమితానందానికి, ఉద్వేగానికి లోనైనపుడు రక్తపోటు కారణంగా గుండెనొప్పి వస్తుందని చెబుతున్నారు. శ్రీనుకి భార్య, ఓ కూతురు, కొడుకు ఉన్నారు. సినిమాకి వెళ్లిన అతను.. విగతజీవుడై ఇంటికి రావడంతో.. ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భార్య, పిల్లల రోదనలు మిన్నంటాయి.


Tags:    

Similar News