తండేల్: రెండు రోజుల్లో రికార్డు వసూళ్లు

నాగచైతన్య, సాయిపల్లవి ‘తండేల్’ రెండు రోజుల్లోనే రూ.41.20 కోట్లు వసూలు చేసి సూపర్ హిట్‌గా దూసుకుపోతోంది!;

Update: 2025-02-09 09:29 GMT
తండేల్: రెండు రోజుల్లో రికార్డు వసూళ్లు
  • whatsapp icon

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన 'తండేల్' సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. చందు మొండేటి దర్శకత్వంలో వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలై, తొలి రోజే రూ.21.27 కోట్లు వసూలు చేసి, చైతన్య కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్ సాధించింది. శనివారం వీకెండ్ కారణంగా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించి, రెండు రోజుల్లో మొత్తం రూ.41.20 కోట్లు రాబట్టింది. ఆదివారం సెలవు దినం కావడంతో, ఈ చిత్రం సులభంగా రూ.50 కోట్ల మార్క్‌ను దాటుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బన్నీ వాసు, అల్లు అరవింద్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలై మంచి స్పందన పొందుతోంది.

Tags:    

Similar News