ఓటీటీలోకి ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’.. ఎప్పుడు..? ఎక్కడ..?
నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.
యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty), స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి (Anushka Shetty) కలిసి జంటగా నటించిన మూవీ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (Miss Shetty Mr PoliShetty). కొత్త డైరెక్టర్ పి.మహేష్ బాబు తెరకెక్కించిన ఈ మూవీని యూవీ క్రియేషన్స్ నిర్మించింది. న్యూ ఏజ్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ మూవీలో నవీన్ స్టాండప్ కమెడియన్‌గా, అనుష్క చెఫ్‌గా నటించారు. సెప్టెంబర్ 7న రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ సక్సెస్ ని అందుకుంది.
తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో రిలీజ్ అయిన ఈ మూవీ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద రూ.50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది. ముఖ్యంగా ఈ మూవీకి ఓవర్ సీస్ లో విశేషమైన ప్రేక్షాదరణ వచ్చింది. అక్కడ ఈ చిత్రం 1 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసి 2 మిలియన్ వైపు పరుగులు పెడుతుంది. కాగా ఆడియన్స్ అంతా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా ఆ డేట్ ని అధికారకంగా ప్రకటించారు.
ఈ సినిమా అక్టోబర్ 5 నుంచి ఓటీటీలో అందుబాటులోకి రానుంది. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో ఈ మూవీ స్ట్రీమ్ కానుంది. తెలుగుతో పాటు కన్నడ, మలయాళ, తమిళ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమాని అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. మరి థియేటర్ లో చూసి ఎంజాయ్ చేసిన వారు మరోసారి, అలాగే అసలు చూడని వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసేయండి.
కాగా ఈ మూవీతో నవీన్ పోలిశెట్టి హ్యాట్రిక్ హిట్ అందుకున్నట్లు అయ్యింది. నవీన్ హీరోగా పరిచయమవుతూ తెరకెక్కిన సినిమా 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ' సూపర్ హిట్టుగా నిలిచింది. ఆ తరువాత 'జాతిరత్నాలు' సినిమాతో బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ మరో హిట్టుని సొంతం చేసుకున్నాడు. ఈ మూడు సినిమాల కలెక్షన్స్ విషయంలో నవీన్ తన మార్కెట్ ని పెంచుకుంటూనే వచ్చాడు.