Pawan Kalyan : అతని కోసమే సినిమాలో జనసేన గాజు డైలాగ్ చెప్పా..

'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలో జనసేన గాజు డైలాగ్ ని అతని కోసమే చెప్పను అంటున్న పవన్ కళ్యాణ్. ఎవరు ఆ అతను..?

Update: 2024-03-20 06:56 GMT
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన పొలిటికల్ షెడ్యూల్స్ లో బిజీగా ఉన్నారు. అయితే ఇంత బిజీ టైంలో కూడా ఇటీవల కొంత సమయం 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా కోసం కేటాయించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో సెలబ్రేషన్స్ లో ఉస్తాద్ భగత్ సింగ్ కి సంబంధించిన చిన్న టీజర్ ని ప్రదర్శించడం కోసం మూవీ టీం ప్లాన్ చేసింది. ఈక్రమంలోనే ఆల్రెడీ షూట్ చేసిన కొన్ని విజువల్స్ తో ఓ టీజర్ ని కట్ చేసి, పవన్ కళ్యాణ్ తో డబ్బింగ్ చెప్పించి ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు.
ఇక ఈ టీజర్ లో పవన్ కళ్యాణ్ రెండు పొలిటికల్ డైలాగ్స్ ని చెప్పారు. గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం, గాజు పగిలేకొద్ది పదునెక్కుద్ది.. అంటూ పవన్ చెప్పిన ఈ డైలాగ్ జనసైనికులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ డైలాగ్స్ గురించి పవన్ మాట్లాడుతూ.. "సినిమాలో ఆ గాజు డైలాగ్ చెప్పడం నాకు ఇష్టం లేదు. కానీ హరీష్ శంకర్ బాధ భరించలేక ఆ డైలాగ్ చెప్పాల్సి వచ్చింది" అంటూ చెప్పుకొచ్చారు.
"హరీష్ శంకర్ ని ఆ డైలాగ్ ఎందుకు రాశావు, ఇప్పుడు ఈ డైలాగ్ నేను చెప్పాలా" అని పవన్ అడిగితే, హరీష్ శంకర్ బదులిస్తూ.. "మీకు తెలియదండి. మీరు కొంచెం తగ్గినా మేము చాలా బాధ పడతాము. అలాంటిది మీరు ఓడిపోయారు అని అందరూ కామెంట్స్ చేస్తున్నారు. వారందరికీ మా తరుపు నుంచి మీరు సమాధానం చెప్పాలి" అని బలవంతం చేశారట. దీంతో పవన్ చేసేదిలేక ఆ డైలాగ్స్ చెప్పారు. ప్రస్తుతం ఈ డైలాగ్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఆ పవర్ ఫుల్ టీజర్ ని మీరు ఒకసారి చూసేయండి.
Tags:    

Similar News