Prabhas : ప్రభాస్, మారుతీ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ అప్డేట్..

ప్రభాస్, దర్శకుడు మారుతి సినిమాని సమయం వచ్చినప్పుడు అనౌన్స్ చేస్తామంటూ చెప్పుకొచ్చిన నిర్మాతలు.. ఫస్ట్ లుక్, టైటిల్ అప్డేట్ ఇచ్చారు.;

Update: 2023-12-29 04:14 GMT
Prabhas, Maruthi, Salaar, Kalki 2898 AD, Prabhas Maruthi Movie title and First look release update, prabhas news, Prabhas Movie title, Prabhas Movie news, movie news

Prabhas Movie title

  • whatsapp icon
Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్, టాలీవుడ్ దర్శకుడు మారుతితో ఒక మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీని అఫీషియల్ గా అనౌన్స్ చేయకుండా.. షూటింగ్‌ని మాత్రం చేసుకుంటూ వెళ్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాని సమయం వచ్చినప్పుడు అనౌన్స్ చేస్తామంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ సమయం వచ్చినట్లు తెలుస్తుంది. ఈ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ అప్డేట్ ని ఇచ్చారు.
ఈ సంక్రాంతికి మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసారు. రీసెంట్ గా డైనోసార్ గా చూసిన ప్రభాస్ ని 
మళ్ళీ డార్లింగ్ లుక్ లో చూడబోతున్నారని మేకర్స్ చెప్పుకొచ్చారు. ఒక సరికొత్త లుక్ లో ప్రభాస్ చాలా స్టైలిష్ గా కనిపించబోతున్నారట. 
కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి ప్రభాస్ లుక్స్ లీక్ అయ్యి ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ మూవీకి 'రాజా డీలక్స్' అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. మరి అదే టైటిల్ ని అనౌన్స్ చేస్తారా అనేది చూడాలి.
అలాగే ఈ మూవీకి పని చేస్తున్న టెక్నీషియన్స్, నటిస్తున్న నటీనటుల వివరాలు కూడా తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో 
నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్ నటిస్తున్నట్లు సమాచారం. 

Tags:    

Similar News